ఖమ్మం

ఆర్థిక సంక్షోభం దిశగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), డిసెంబర్ 6: ప్రధానమంత్రి తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో రానున్న రోజుల్లో భారత్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి నాగయ్య పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని మంచికంటిమీటింగ్ హాల్ నందు మంగళవారం యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన జిల్లా ప్లీనంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో చరిత్రలో ఎన్నడూలేని విధంగా పేదలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయంతో యావత్ దేశం ముక్తకంఠంతో విమర్శిస్తోందన్నారు. ఆర్థికవేత్తలు అమర్త్యసేన్, మన్మోహన్‌సింగ్ లాంటి వారు త్వరలోనే పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశంలో స్పష్టంగా కనిపిస్తుందన్నారని తెలిపారు. దీనికి కారణం ఆర్థిక విపత్తు, ఆర్థిక మాంద్యం, ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందన్నారు. నల్లధనాన్ని వెలుగులోకి తెస్తామన్న సాకుతో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దేశ వ్యాప్తంగా పేదలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. కార్పోరేట్ సంస్థలు, పెట్టుబడి దారులు ఏమాత్రం ఇబ్బందులు పడలేదన్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను కేంద్రం పట్టించుకున్న దాఖలాలులేలన్నారు. 2004 నుండి 2013 మధ్యకాలంలో దేశంలో దాదాపు 3 లక్షల మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ రంగం పట్ల కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రైతుల బలవన్మారణాలకు కారణం అన్నారు. ఒక వైపు ఎరువుల ధరలపై కేంద్ర నియంత్రణ ఎత్తివేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలేకపోవడం, పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడి రాకపోవడంతోనే రైతులు అనివార్యంగా అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. ఇటీవల కాలంలో దేశ ప్రజలు ఏమితినాలో, ఏమితినకూడదో పాలకులే నిర్ణయించడం దారుణమన్నారు. రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుతూ కెసిఆర్ సంక్షేమపధకాలతో ప్రజలకు ఉదరగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ నేతలు రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు వరిగిందేమి లేదన్నారు. సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని చేపట్టిన మహాజన పాదయాత్రను అడ్టుకోవాలని చూశారని ఆయన గుర్తుచేశారు. అనంతరం ప్లీనంలో జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు జిల్లా కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు, రాష్ట్ర కమిటి సభ్యులు నున్నా నాగేశ్వరరావు, బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, బత్తుల లెనిన్, జిల్లా కమిటి సభ్యులు, మండల కమిటి సభ్యులు, మండలాల పార్టీ కార్యదర్శులు పాల్గొన్నారు.