ఖమ్మం

చూద్దాం... చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 6: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నెలకొన్న సమస్యలను చూద్దాం... చేద్దాం అని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిషనర్ లక్ష్మీబాయి పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ఆమె పరిశీలించారు. మార్కెట్ సమస్యలపై ఆమెకు వివరించడంతో చూద్దాం... చేద్దాం అని చెప్పడమే తప్ప స్పష్టమైన సమాదానాన్ని ఇవ్వలేకపోయారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు, దడవాయిలు, కార్మికులతో పాటు అందరూ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండాలని సూచించారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఆన్‌లైన్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై మార్కెట్లో కూడా నగదు రహిత లావాదేవిలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే రైతు బజార్లలో కూడా మైక్రో ఏటిఎంలను ఏర్పాటు చేసి వినియోగారులకు, రైతులకు లావాదేవిలు వీటిద్వారానే నడిపించే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికోసం అన్ని బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్లు, త్వరలోనే వాటిని అమలయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ఏర్పాటు చేయనున్న నగదు రహిత లావాదేవిల కోసం ముందుగా ఈ నెల 10వ తేదీన నిజామాబాద్‌లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా వ్యవసాయ మార్కెట్లలో ఇనామ్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని, వాటిని త్వరలోనే పరిష్కరించి ఇనామ్ పద్దతి ద్వారానే కొనుగోళ్ళు జరపనున్నట్లు తెలిపారు. ట్రేడర్స్, కమీషన్‌దారులు రైతులతో నగదు రహిత లావాదేవిలే జరపాలని సూచించారు. కోల్డ్‌స్టోరేజ్‌లకు అనుమతులు ఇచ్చేవి మా శాఖే అయినప్పటికీ వాటిలో నిల్వ చేసే పంటలను, జిరో స్టాక్‌లపై పరిశీలిస్తామే కానీ నిల్వచేసిన పంటల కల్తీలను గుర్తించే అధికారం మాకు లేదన్నారు. దడవాయిలు, కమిషన్‌దారులు, కార్మికుల సమస్యలను నెమ్మదిగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎస్‌ఇ నాగేశ్వరరావు, డిడి ఎల్లయ్య, మార్కెట్ చైర్మన్ జి కృష్ణ, కార్యదర్శి ప్రసాద్‌రావు, అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
లైసెన్స్‌లు మంజూరు చేయాలని వినతి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కొన్ని సంవత్సరాలుగా కమిషన్ వ్యాపారం చేస్తున్న కమిషన్‌దారులకు జిఓ నెంబర్ 49ప్రకారం లైసెన్స్‌లు మంజూరు చేయాలని కమిషనర్ లక్ష్మిభాయికి వినతిపత్రాన్ని కమిషన్‌దారులు అందించారు. ఈ సందర్భంగా కమిషన్‌దారులు మాట్లాడుతూ లైసెన్స్‌ల మంజూరు విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో జిఓ నెంబర్ 49ప్రకారం లైసెన్స్‌లు మంజూరు చేయాలని తీర్పు ఇచ్చినప్పటికీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దరఖాస్తులు చేసుకున్న కమిషన్‌దారులకు లైసెన్స్‌లు మంజూరు చేయాలని అప్పారావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు కోరారు.