ఖమ్మం

జైపూర్‌లో జెబిసిసిఐ సమావేశం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 6: బొగ్గుగని కార్మికులకు జాతీయ స్థాయిలో 10వ వేతన ఒప్పందం కోసం జైపూర్‌లో మంగళవారం జాయింట్ బైపార్టెడ్ కమిటీ ఆఫ్ కోల్ ఇండస్ట్రీస్ (జెబిసిసిఐ) సమావేశం ప్రారంభమైంది. రెండురోజుల పాటు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. తొలిరోజైన మంగళవారం పరిచయ కార్యక్రమం అనంతరం ఏజెండాను రూపొందించుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ, కోలిండియా ప్రతినిధులు, సింగరేణితో సహా దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు, జాతీయ కార్మికసంఘాలైన ఎఐటియుసి, సిఐటియు, హెచ్‌ఎంఎస్, బిఎంఎస్, ఐఎన్‌టియుసి ప్రతినిధులు పాల్గొంటారు. అయితే ఐఎన్‌టియుసి అంతర్గత కలహాలతో సతమతమవుతూ కోర్టుకెక్కిన కారణంగా ఆ యూనియన్ మినహా మిగిలిన నాలుగు యూనియన్ల నుండి ముగ్గురు సభ్యుల చొప్పున సమావేశంలో పాల్గొంటున్నారు. ఐఎన్‌టియుసి నుండి మాత్రమే ఆరుగురు సభ్యులకు అవకాశమున్నప్పటికీ ఆ యూనియన్ అంతర్గత సమస్యల కారణంగా ఎవరూ హాజరు కాలేదు. 18 మంది సభ్యులు యూనియన్ల నుండి, మరో 18 మంది సభ్యులు అధికారికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బొగ్గు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గురంగ పరిశ్రమల రిప్రంజెంటేటివ్ మేనేజ్‌మెంట్ కమిటీకి కోలిండియా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదేవిధంగా కోలిండియాలోని ముగ్గురు డైరెక్టర్లు, ఇసిఎల్, బిసిసిఎల్, సిసిఎల్, డబ్ల్యుసిఎల్, ఎస్‌ఇసిఎల్, ఎన్‌సిఎల్, ఎంసిఎల్, బిసిసిఎల్, ఇసిఎల్, ఎస్‌సిసిఎల్ (సింగరేణి) సిఎండి, డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు.
ప్రధానంగా చర్చించే అంశాలు
జెబిసిసిఐలో ప్రధానంగా బొగ్గుగని కార్మికుల వేతనం, అలవెన్స్‌లపై చర్చ జరుగుతుంది. ఐదు జాతీయ కార్మికసంఘాలు వేర్వేరుగా తమ డిమాండ్లను వినిపిస్తాయి. ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం జరుగుతుంది. గత 2011లో జరిగిన 9వ వేతన ఒప్పందంలో 25శాతం మినిమం గ్యారెంటెడ్ బెన్‌ఫిట్‌ను జాతీయ కార్మికసంఘాలు సాధించగలిగాయి. సింగరేణి నుండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్, డైరెక్టర్ (పాఅండ్‌ఫైనాన్స్) జె పవిత్రన్‌కుమార్, జనరల్‌మేనేజర్ (పర్సనల్) ఐఆర్‌ఎ ఆనందరావులు జెబిసిసిఐ సమావేశంలో పాల్గొంటున్నారు. సింగరేణిలో 54,858 ఎన్‌సిడబ్ల్యుఎ కార్మికులు, 2,435 ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. మొత్తం కలిపి 57,293 మంది సింగరేణిలో ఉన్నారు.