హైదరాబాద్

జిల్లా స్థాయి ప్రణాళిక తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనలను అనుసరించి ప్రతి జిల్లాలకు జిల్లా స్థాయి ప్రణాళిక తయారు చేయటం తప్పనిసరి అని, అందులోనూ సూక్ష్మ స్థాయి డేటా తప్పకుండా ఉండేలా చూసుకోవాలని చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర హైదరాబాద్ జిల్లా అధికారులకు సూచించారు. ఈ నెల 14న జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయా జిల్లాల సమగ్రాభివృద్దికే తీసుకోవల్సిన చర్యలపై కలెక్టర్లతో మంగళవారం ఆయన సచివాలయం నుంచి ఉన్నతాధికారులు అజయ్‌మిశ్రా, సోమేశ్‌కుమార్, బిఆర్ మీనాలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం ఆయా జిల్లాల వారీగా సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవటంతో పాటు జిల్లా అభివృద్దికై ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకై ముఖ్యమంత్రి నో యువర్ డిస్ట్రిక్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ అనే కార్యక్రమాన్ని రూపొందించి, అందుకు అనుగుణంగా కలెక్టర్లను ప్రణాళికను తయారు చేసుకోవాలని సూచించారు. అందులో జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ ప్రణాళికలుండాలని పేర్కొన్నారు. ప్రణాళికల రూపకల్పనలో ఆయా జిల్లాల్లో గల వనరులు, ప్రత్యేక పరిస్థితులు, సమస్యలు వంటివి పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ ప్రణాళిక రాబోయే అయిదు సంవత్సరాల వరకు ఎదురయ్యే అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి, సిపివో బలరాం హజరయ్యారు.