హైదరాబాద్

రాజకీయ, సినీరంగాల్లో జయలలితకు ప్రత్యేక స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, డిసెంబర్ 7: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం చిత్రపరిశ్రమకు తీరనిలోటని ప్రజానటి జమునా రమణరావు అన్నారు. ఘంటసాల ఆరాధనోత్సవాలు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జమున జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. శ్రీకృష్ణ విజయంలో జయలలితో పాటు తాను నటించానని పేర్కొన్నారు. రాజకీయ చరిత్రలో, చిత్రపరిశ్రమలో తనకంటూ ఓప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారని కొనియాడారు. కేవలం నటిగానే కాకుండా రాజకీయంగా ప్రజలకు ఎంతో సేవలదించిన గొప్ప మహిళామూర్తి జయలలిత అని కీర్తించారు. ముందుగా ప్రముఖ గాయనీ, గాయకులు డిఎ మిత్ర, సురేఖమూర్తి దివాకర్ల, గీతాంజలి, అనిరుధ్ అలపించిన ఘంటసాల సినీ గీతాలు అందరినీ ఎంతో అలరించాయి. కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు, ప్రముఖ నటి రాధాప్రశాంతి, డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.