రాశిఫలం 10-12-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
శుద్ధ ఏకాదశి మ.3.06
నక్షత్రం: 
అశ్విని రా.2.57
వర్జ్యం: 
రా.11.12 నుండి 12.42 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.06.00 నుండి 07.36 వరకు
రాహు కాలం: 
ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశముంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా నుండుట మంచిది.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. మెలకువగా నుండుట అవసరం. స్థానచలనమేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్ర్తిల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లలపట్ల పట్టుదల పనికిరాదు
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. అజీర్ణబాధలు అధికమగును. కీళ్లనొప్పుల బాధనుండి రక్షించుకోవడం అవసరం.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. క్రొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందలుగుతారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) క్రొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ధననష్టమేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా క్రొత్త సమస్యలనెదుర్కొంటారు.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు.
Date: 
Saturday, December 10, 2016
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి