కర్నూల్

స్టాక్ పాయింట్ అక్రమాల పుట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, డిసెంబర్ 9: ప్రజలకు చౌక దుకాణాల ద్వారా అందజేసే నిత్యావసర వస్తువుల స్టాక్‌పాయింట్ అక్రమల పుట్ట అంటూ ఎన్నో సార్లు ఆంధ్రభూమి స్టాక్‌పాయింట్‌లో జరిగే అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చిం ది. అయితే ఎట్టకేలకు ఆలస్యంగానైన ఆదోని స్టాక్‌పాయింట్‌పైన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిఘా పెట్టి అక్రమంగా తరలిస్తున్న 99 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చివరకు అక్రమార్కులపై కేసు లు పెట్టారు. అక్రమార్కులు కటకటలాపాలయ్యారు. ఈ విధంగా స్టాక్ పాయింట్‌కు వచ్చిన అధికారి ఆధ్వర్యంలో గత మూడేళ్ల నుంచి అక్రమా లు యథేచ్ఛగా సాగుతున్నాయి. గోదాం ఇన్‌ఛార్జి అధికారి నేతలకు నెలకు రూ. లక్షల ముడుపులు ఇవ్వ డం వల్ల అక్రమ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా సాగింది. విజిలెన్స్ అధికారుల దాడులకు ముందే పోలీసు అధికారులు బియ్యం, పేదలకు అందాల్సిన చంద్ర న్న కానుకలు అక్రమంగా నల్లబజారులో అమ్ముతుండగా పట్టుకుని కేసులు పెట్టారు. అలాగే స్టాక్ పాయింట్‌కు దగ్గరలో ఉన్న మార్కెట్‌యార్డులోని ఒక దుకాణంలో ఉంచిన సబ్సిడీ బియ్యం 20 బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు పెట్టారు. అయినా స్టాక్ పాయింట్‌లో ఉన్న అధికారి ఏమాత్రం భయం లేకుండా నాయకులకు ముడుపులు ఇస్తున్నారు కాబట్టి అక్రమాలను మా నుకోలేదు. స్టాక్‌పాయింట్‌లోనే డీలర్లకు ఒక్కొక్క బియ్యం బస్తాకు 5 కిలో లు తక్కువ తూకం చేసి వారికి సరఫరా చేస్తున్నారు. ఈ 5 కిలోల చొప్పు న తక్కువ తూకం వేసిన బియ్యాన్ని మూడు లారీల లోడుకు వచ్చిన తరువాత లారీల ద్వారా, ఆటోల ద్వారా డీలర్ల షాపులకు తరలించి అక్కడ నుంచి నల్లబజారుల వ్యాపారులకు కిలో రూ. 8 చొప్పున అమ్మి ఆ డబ్బు ను స్టాక్ పాయింట్‌లో ఉన్న అధికారి జేబులో కొంత వేసుకుని మరి కొంత అధికారులకు, రాజకీయ నాయకులకు ప్రతి నెల ముడుపులు చెల్లించడం జరుగుతుంది. అందువల్ల పోలీసులకు ఎన్నిసార్లు అక్రమ బియ్యం, చంద్రన్న కానుకలు దొరికిన స్టాక్ పాయింట్ అధికారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా ఇటీవల స్టాక్ పాయింట్‌లో అవినీతి మరింత పెరిగిందిపోయింది. అంతేకాకుండా బియ్యం, నిత్యావసర వస్తువులు స్టాక్ పాయింట్ నుండి డీలర్లకు లారీల ద్వారా సరఫరా చేసే విధానంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. సరుకులు డీలర్ల దూకాణాలకు సరఫరా చేస్తామని టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ లారీలలో సరుకులు చేరవేయకుండానే బిల్లులు పెట్టి స్టాక్ పాయింట్ అధికారితో కుమ్మకై లక్షలు దోచుకున్నారు. డీలర్లు తమ సరుకులను ఆటోల ద్వారా తరలిస్తున్న అంశాన్ని ఆంధ్రభూమి ఎన్నోసార్లు ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే. ఈవిధంగా కూడా రవాణ చేయకుండానే డబ్బులను జేబులోవేసుకుంటున్న అవినీతి కూడా స్టాక్ పాయింట్‌లో ప్రతినెల జరుగుతుంది. స్టాక్ పాయింట్‌లో ఉన్న ప్రతి నిత్యావసర వస్తువుల సరుకులు ప్రతి నెల నల్లబజారుకు తరులుతున్నాయి. తక్కువ తూకం బియ్యం, ఇతర వస్తువులు తక్కువగా రావడం వల్ల డీలర్లు ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. చివరకుప్రజలకు నిత్యావసర వస్తువులు డీలర్లు సక్రమంగా తూకం వేయకుండా ప్రతినెల దోచుకుంటున్నారు. ఈవిధంగా స్టాక్ పాయింట్ నుండే అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఆలస్యంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కళ్లు తెరిచి ఆదోని స్టాక్‌పాయింట్‌పై నిఘా ఉంచి దాడి చేయగా డీలర్ల సహకారంతో బియ్యం నల్లబజారుకు తరలించే అవినీతి అక్రమాల పుట్ట గురువారం అర్ధరాత్రి వెలుగు చూసింది. మూడు ఆటోల్లో 99 బస్తాలను ఇన్‌ఛార్జి డీలర్ అస్లాంబాషా స్టోర్‌కు తరలించగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం స్టాక్ పాయింట్ అధికారి గిరిధర్‌ను అధికారులు విచారించారు. అయితే స్టాక్ పాయింట్ అధికారి ఎలాంటి భయం లేకుండా అధికారులకు సమాధానాలు ఇవ్వడం అందరిని ఆశ్చర్య పరిచింది. ప్రజల నోట్లు మట్టికొట్టి స్టాక్ పాయింట్‌లోనే బియ్యం తక్కువ తూకం వేసి ఆ బియ్యాన్ని బజారులో అమ్ముకుంటూ పట్టుపడిన 99 బస్తాల బియ్యం స్టాక్‌పాయింట్‌లో జరిగే అక్రమాలకు, అవినీతికి తిరుగులేని సాక్ష్యం. ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు ఇన్‌ఛార్జి డీలర్ అస్లాంబాషా, స్టాక్ పాయింట్ అధికారి గిరిధర్, ముగ్గురు ఆటో డ్రైవర్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే విజిలెన్స్ అధికారులు స్టాక్‌పాయింట్ అధికారిని అదుపులోకి తీసుకోని మరింత లోతులో విచారిస్తే నెలనెల ముడుపులు అందుకుంటున్న రాజకీయ నాయకుల పేర్లు కూడా వెల్లడి అవుతాయి. అలాగే అధికారుల పేర్ల కూడా వెలుగులోకి వస్తాయి. ఇప్పటికైనా స్టాక్‌పాయింట్‌లో అధికారులపైన చర్యలు తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇలాగే విజిలెన్స్ అధికారులు స్టాక్ పాయింట్ల వద్ద నిఘాపెట్టి ప్రజలకు అందాల్సిన నిత్యావసర సరుకులు నల్లబజారుకు తరలించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమైనప్పటికి స్టాక్ పాయింట్ అధికారితోపాటు సహకారం అందించిన డీలర్‌పై కూడా కేసు పెట్టడంతో అక్రమార్కులు కటకటాలపాలయ్యారు.