హైదరాబాద్

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: జిల్లాలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహానికి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో, జిల్లా అధికారులతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకులలో అవసరం మేరకు డబ్బు లేనందున ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా అవగాహన కల్పించాలని సూచించారు. స్మార్ట్ ఫోన్‌లు, ఏటిఎంలు, మీ-సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. జనవరి 1వ తేదీ నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చెల్లింపులు నగదు రహిత లావాదేవీల ద్వారా నిర్వహించడం మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఓఎస్‌డిలు ప్రతి మంగళవారం నిర్వహించే మండల సమావేశంలో అన్ని గ్రామాల క్లస్టర్ ఇన్‌చార్జి అధికారులతో కలిసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు డిజిటల్ లావాదేవీలు చేసేందుకు అవగాహన కల్పించాలని, బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లతో కలిసి గ్రామంలోని ప్రజల అకౌంట్‌ల వివరాలు సేకరించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్‌కార్డు అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, సోషల్ వర్కర్‌లు, వాల్లంటరీలుగా ఉండి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. హరితహారాన్ని మరింత పకడ్బందీగా చేపట్టడానికి వర్షాకాలం నాటికి నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని ఓఎస్‌డిలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం ఆవశ్యకత పై ప్రజల్లో అవగాహన పెంపొందించి ఉద్యమంగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ పమేళ సత్పతి, ఎల్‌డిఎం శాస్ర్తీ పాల్గొన్నారు.

పెద్ద నోట్ల రద్దుతో కూలీలు, మధ్యతరగతి ప్రజలకు తిప్పలు

చార్మినార్, డిసెంబర్ 19: కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో చిన్నా, మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులు, కూలీలు, చిన్న తరహా పరిశ్రమలు, వృద్దులతో కలిపి సుమారు తొంభై శాతం మంది ప్రజలు తీవ్ర తిప్పలు ఎదుర్కొంటున్నారని ప్రొగ్రెసివ్ ఫోరం నిర్వహించిన సెమినార్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘పెద్ద నోట్ల రద్దు-దాని పర్యావసనాలు’ అన్న అంశంపై సెమినార్‌లో ఫోరం జాతీయ అధ్యక్షుడు కెఎస్ చలం, బ్యాంక్ ఎంప్లారుూస్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు, ఆర్ధిక విశే్లషకుడు డి.పాపారావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.సాంబశివరావు మాట్లాడుతూ దేశ రక్షణ, దొంగ నోట్లు, నల్లధనం నివారణ, ఉగ్రవాదం రూపుమాపటం అనే నినాదంతో ఏకపక్షంగా పెద్ద నోట్ల రద్దు చేశారని ఆరోపించారు. వంద రోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని వెలికితీస్తామని, ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు ఇస్తాననే వాగ్ధానాలను తుంగలో తొక్కి, కార్పొరేట్ సంస్థలకు, ఇతర బడాబాబులకు వత్తాసు పలికారని మండిపడ్డారు. బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్న వారికి అప్పులు మాఫీ చేశారని విమర్శించారు.
నగదు విత్‌డ్రాలకు సంబంధించి విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయటంతో పాటు కొత్త నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వారి కష్టాలను దూరం చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, పెద్ద కంపెనీలు ఇతర అధికారుల బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆదిరెడ్డి, బాలమల్లేశ్, ఇటె నరసింహ, నర్సింగ్‌రావు, కె.ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.