క్రీడాభూమి

ఎఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడిగా ప్రఫుల్ ‘హ్యాట్రిక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్ వరుసగా మూడోసారి ఎన్నికై, హ్యాట్రిక్ సాధించాడు. అతను నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగుతాడు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాను అనుసరించి ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎఐఎఫ్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. 2008లో అప్పటి అధ్యక్షుడు ప్రియరంజన్ దాస్‌మున్షీకి గుండెపోటు రావడంతో, అతని స్థానంలో ప్రఫుల్ తాత్కాలిక అధ్యక్షుడిగా సేవలు అందించాడు. 2009లో మొదటిసారి, 2012లో రెండోసారి అతను ఎఐఎఫ్‌ఎఫ్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు. తాజాగా మరోసారి అతనిని ఈ పదవి వరించింది.

అభిమాని అరెస్టుపై అఫ్రిదీ విచారం
కరాచీ, డిసెంబర్ 21: తన అభిమానిని అస్సాంలో పోలీసులు అరెస్టు చేయడంపై పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీ విచారం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ల్లో అఫ్రిదీ ధరించే జెర్సీని పోలిన షర్టును ధరించడగాక, దానిపై నంబర్‌తో కనిపించిన రిపోన్ చౌదరీ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ జనతా పార్టీ యువజన విభాగం సభ్యులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు చౌదరీని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో, ఇలాంటి చర్యలతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అంటున్నారు.