జాతీయ వార్తలు

సర్దుబాటుకు ససేమిరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డిల మధ్య కుదురుతుందనుకున్న సీట్ల సర్దుబాటు మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలిసింది. ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలనే అంశంతో పాటు కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల పంపకంలో విభేదాలు పొడసూపినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఎస్‌పితో సీట్ల సర్దుబాటును వ్యతిరేకిస్తోంది. యుపి అసెంబ్లీలో 404 సీట్లుంటే ఇందులో కాంగ్రెస్‌కు 75, అజిత్‌సింగ్ నాయకత్వంలోని ఆల్‌ఎల్‌డికి 20 సీట్లు కేటాయించేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినాయకత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే యుపిలో కాంగ్రెస్ కనుమరుగైపోతుందని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ హెచ్చరించినట్లు తెలిసింది. పైగా ఎస్‌పితో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు వార్తలను ఆయన ఖండించారు. సీట్ల ఒప్పందం గురించి ఎవ్వరితో ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేరు ప్రకటించి ఇప్పుడు ఎస్‌పితో సీట్ల సర్దుబాటు చేసుకుంటే పార్టీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీల్లో కూడా పరాభవం ఎదుర్కొవలసి వస్తుందని సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్ హెచ్చరించినట్లు చెబుతున్నారు.
యుపిలో ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా తయారైంది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ, ఆర్‌ఎల్‌డితో ఒప్పందం చేసుకుంటే కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైవుతుందని రాహుల్ గాంధీకి ఏఐసిసితోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు సైతం హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీ ఎన్నికల ప్రచార సలహాదారు ప్రశాంత్‌కిశోర్ ప్రతిపాదనల ఆధారంగా సమాజ్‌వాదీతో సీట్ల సర్దుబాటు కాంగ్రెస్ మనుగడకే ప్రమాదంగా మారుతుందని వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. అటు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటుకు రంగం సిద్దమైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆర్‌ఎల్‌డి అధినాయకుడు అజిత్‌సింగ్ స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు గురించి తాను కాంగ్రెస్, ఎస్‌పి నేతలతో ఎలాంటి చర్చలు జరపలేదంటున్నారు.