క్రీడాభూమి

స్పెయిన్‌తో అడనందుకు బొపన్నపై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 3: భారత్‌కు ప్రాతినిధ్యం వహించాల్సి వచ్చినప్పుడు తమకిష్టమైన టోర్నమెంట్‌లనే ఎంపిక చేసుకునే ఆటగాళ్లను సహించేది లేదన్న స్పష్టమైన సంకేతాలనిచ్చేందుకే గాయం సాకుతో స్పెయిన్‌తో జరిగిన పోటీనుంచి తప్పుకున్న రోహన్ బొపన్నను డేవిస్ కప్ బృందంనుంచి తప్పించినట్లు అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటిఏ) అంటోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో స్పెయిన్‌తో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీనుంచి బొపన్న తప్పుకోవడాన్ని ఏఐటిఏ తీవ్రంగా పరిగణించింది. బొపన్న తాను గాయపడినట్లు కుంటిసాకు చెప్పాడని ఏఐటిఏ వర్గాల్లో చాలామంది భావిస్తున్నారు. సెప్టెంబర్ 18న చివరి రోజు పోటీల్లో పాల్గొనని బొపన్న అంతకు ముందు రోజు బెంగళూరులోని ఒక బార్‌లో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పటి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు.‘ మేము కళ్లు మూసుకుని లేము. దేశం తరఫున ఆడాలన్న ఫీలింగ్ ఒక అటగాడికి లేనప్పుడు అతనికి జట్టులో ఉండే అర్హత లేదు. అది చాలా కీలకమైన పోటీ. ఆటగాళ్లు ఈ సవాలు కోసం సిద్ధమవుతారని మేము ఆశించాం’ అని ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన ఏఐటిఏ అదికారి ఒకరు పిటిఐతో అన్నారు. అయితే న్యూజిలాండ్‌తో జరిగే పోటీ కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో సమావేశంలో ఈ అంశం చర్చకు రాలేదని, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎస్‌పి మిశ్రా అంటున్నారు. అయితే ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లను, ఒక డబుల్స్ స్పెషలిస్టును ఎంపిక చేయాలని తమకు ఆదేశాలున్నట్లు ఆయన చెప్పారు. లియాండర్ పేస్‌కన్నా బొపన్నకు మెరుగైన ర్యాంక్ ఉన్నప్పటికీ పేస్‌కే కమిటీ ప్రాధాన్యత ఇచ్చింది.
అయితే స్పెయిన్‌తో జరిగిన పోటీకి బొపన్న డుమ్మా కొట్టడమే సమస్యగా అయిందన్న సంకేతాన్ని ఏఐటిఏ ప్రదాన కార్యదర్శి హిరణ్మయ్ చటర్జీ ఇచ్చారు. డేవిస్ కప్ మాజీ ఆటగాళ్లంతా సెలెక్టర్లుగా ఉన్నారని, వారు అన్ని విషయాలతో పాటుగా బొపన్న సమస్యను కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత జట్టును ఎంపిక చేశారని ఆయన అంటూ, అందరు కూడా వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే బొపన్న మాత్రం తాను నిజంగానే గాయపడ్డానని, అవసరమైన పక్షంలో 5 సెట్లు ఆడడానికి తాను ఫిట్‌గా లేనని గట్టిగా వాదిస్తున్నాడు. అంతేకాదు డ్యాన్స్ చేస్తున్న వీడియో గురించి అడగ్గా, అంతమాత్రాన తాను ఒక పోటీ మ్యాచ్ ఆడడానికి ఫిట్‌గా ఉన్నట్లు కాదని కూడా అతను వాదించాడు.