జాతీయ వార్తలు

ప్రపంచం నవ్వుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే దేశానికి మంచి రోజులని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన స్పష్టం చేశారు. రాహుల్ బుధవారం ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశ ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు వివిధ పార్టీ నాయకులతో ఏర్పాటైన సదస్సును ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. పెద్దనోట్ల రద్దు తదనంతర పరిస్థితులపై కన్నా మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ దాడి కొనసాగించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన మోదీ చర్యలు చూసి ప్రపంచం నవ్వుతోందంటూ అపహాస్యం చేశారు. ఆర్‌బిఐ, కేంద్ర ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ తదితర అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రధాని సర్వనాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధ్వజమెత్తారు.
నరేంద్ర మోదీ ఒక్కరే దేశాన్ని బాగుపరుస్తారట. మమనమంతా మూర్ఖులమా? అంటూ విరుచుకు పడ్డారు. దేశ ప్రజలు తెలివిమంతులని, వీరి ముందు మోదీ ఆటలు సాగవన్నారు. వెలుగులోకి వచ్చిన నల్లధనం వివరాలను ప్రజల ముందు పెడతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అవినీతిపై మోదీ చేసిన మెరుపుదాడి మూలంగా రైతుల నడ్డి విరిగిందని రాహుల్ ఆరోపించారు. సహారా, బిర్లా పత్రాల ద్వారా వెలుగులోకి వచ్చిన ముడుపుల వ్యవహారానికి మోదీ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదన్నారు. పెద్దనోట్ల రద్దు మూలంగా ఏమేరకు నల్ల ధనాన్ని ఆదుపు చేశారని రాహుల్ ప్రశ్నించారు. కార్లు తదితర వాహనాల విక్రయాలు ఆరు శాతానికి ఎందుకు పడిపోయాయి? ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు రావలసిన ప్రజలు గ్రామాలకు ఎందుకు పోతున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం డిమాండ్ ఎందుకు పెరిగిపోయిందంటూ రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు. పెద్ద నోట్లను రద్దు చేయాలనేది నరేంద్ర మోదీ వ్యక్తిగత నిర్ణయని ఆయన ఆరోపించారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే దేశానికి మంచి రోజులు వస్తాయన్నారు. ‘కాంగ్రెస్ గత 70 సంవత్సరాల్లో ఏం చేసిందని నరేంద్ర మోదీ, బిజెపి మాటి మాటికి అడుగుతుంటారు, కాంగ్రెస్ చేసిన త్యాగాలేమిటో దేశ ప్రజలకు బాగా తెలుసు’అని రాహుల్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దేశానికి రక్తాన్ని ధారపోశారన్న రాహుల్ బిజెపి వారు ఇలా చేశారా? అని నిలదీశారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసింది చెప్పాల్సిన అవసరం తమకు లేదని ప్రజలు అంతా తెలుసని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని మార్చేస్తానంటున్న మోదీ ప్రకటనలు రాహుల్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగం పెరిగిపోతోంది, ఉత్పాదన పడిపోతుంటే మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఆయన ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలోని ప్రజలందరూ బాధల పడుతున్నారని అయితే పత్రికలు మాత్రం ఎక్కడా ఆ విషయాన్ని రాయడం లేదని ఆయన చురకేశారు. ప్రధాని ఒత్తిళ్ల వల్లే మీడియా వౌనం వహిస్తోందని రాహుల్ ఆరోపించారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, కనెక్ట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, యోగా అంటూ పథకాలను ప్రకటించిన మోదీ వీటిని సక్రమంగా అమలు చేయగలిగారా? అని ఆయన నిలదీశారు. నరేంద్ర మోదీకి చీపురు కూడా సరిగ్గా పట్టుకోవటం రాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దును ప్రపంచ ఆర్థిక నిపుణులే తప్పుపడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజల పక్షాన నిలిచేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఈ సదస్సుకు హాజరు కాలేదు.