హైదరాబాద్

ఐసిస్ ఉగ్రవాది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్‌లో ఐసిస్ సానుభూతిపరులున్నారా..? నగరంలో మరోసారి భారీ విధ్వంసానికి వ్యూహం జరుగుతోందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరించేందుకు వ్యూహాలు జరగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఉగ్రవాది మహమ్మద్ ఇర్ఫాన్ అలియాస్ అబూజాఫర్‌ను అరెస్టు చేసింది. ఇర్ఫాన్ నగరంలోని పలు ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించాడు. సురక్షిత స్థావరాలను వెతికి ఆయా ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఇర్ఫాన్ కదలికలను పసిగట్టిన ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఇర్ఫాన్‌కు ఏడు రోజుల కస్టడీ విధించింది. కాగా, ఐసిస్ కమాండర్ మహమ్మద్ ఇబ్రహీం ఎజ్దానీ సూచనల మేరకు ఇర్ఫాన్ పలు ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకున్నట్టు గుర్తించామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

నరుూం గ్యాంగ్ సభ్యుడిపై పీడీ యాక్టు

హైదరాబాద్, జనవరి 17: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నరుూం గ్యాంగ్ సభ్యుడిపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పలు కేసుల్లో నిందితుడైన నరుూం గ్యాంగ్ సభ్యుడు శ్రీహరి కిడ్నాప్, హత్య, నేరపూరిత కుట్ర తదితర కేసుల్లో నిందితుడని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్లలో శ్రీహరిపై కేసులు నమోదై ఉన్నాయని, అతడిపై పీడీయాక్ట్ పెట్టామని సిపి మహేశ్ భగవత్ తెలిపారు. ఇదిలావుండగా నరుూం ముఖ్య అనుచరుల్లో ఒకరైన శేషన్న కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత కనిపించకుండా పోయిన శేషన్న ఎక్కడున్నది పోలీసులు ఆచూకీ కనుగొనలేకపోయారు. తెలంగాణలో అక్కడక్కడ ఇప్పటికీ నరుూం పేరుతో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శేషన్న పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. నిజంగానే శేషన్న పోలీసులకు దొరకలేదా? లేక పోలీసులే అతణ్ని తప్పిస్తున్నారా? అనే మీమాంస వ్యక్తమవుతోంది. పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులకు కూడా నరుూంతో సంబంధాలున్నాయన్న వార్తల నేపథ్యంలో సంబంధాలున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసి పెద్ద దుమారం రేపుతోంది. ఇలాంటి సమయంలో శేషన్న ఆచూకీ తెలుసుకోవడంలో పోలీస్ శాఖ విఫలమవ్వడం పలు విమర్శలకు తావిస్తోంది.