క్రీడాభూమి
ఎదురుదాడికి లంక సిద్ధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సెంచూరియన్, జనవరి 19: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ వేయించకున్న శ్రీలంక శుక్రవారం నుంచి మొదలయ్యే టి-20 సిరీస్‌లో ఎదురుదాడి చేసేందుకు సిద్ధమైంది. మొదటి టెస్టును 206, రెండో టెస్టును 282 పరుగుల తేడాతో కోల్పోయిన లంక, చివరిదైన మూడో టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 118 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ పరాజయాలతో ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తున్న లంక, మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను గెల్చుకొని, పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ ఫార్మాట్లో దక్షిణాఫ్రికా బలమైన జట్టుగా గుర్తింపు పొందింది. పైగా స్వదేశంలో సిరీస్ ఆడుతున్నది. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచింది. ఈ మూడు అంశాలు దక్షిణాఫ్రికాను ఫేవరిట్‌గా నిలబెడుతుండగా, శ్రీలంక ఏ విధంగా ప్రతిఘటిస్తుందో చూడాలి. శుక్రవారం నాటి మొదటి టి-20లో గెలిస్తేనే, ఈ సిరీస్‌పై లంక ఆశలు సజీవంగా నిలబడతాయి. మొదటి మ్యాచ్‌ని కోల్పోతే, ఆతర్వాత రెండు మ్యాచ్‌ల్లో నిలదొక్కుకోవడం లంకకు కష్టమన్నది వాస్తవం. మిగతా రెండు టి-20 మ్యాచ్‌లు వరుసగా 22, 25 తేదీల్లో జరుగుతాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాతో లంక ఐదు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో తలపడుతుంది.