అనంతపురం

విహార యాత్రలేవీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, జనవరి 21: పదిమంది గొప్పగా చెప్పే విశేషాలు, వింతలు, యాత్రా స్థలాల గురించి విన్నప్పటికంటే వాటిని చూసినప్పుడు వాటిపై పెరిగే అవగాహన, వాటి వల్ల వచ్చే పరిజ్ఞానం ఎక్కువని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించి ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్లవలసిందిగా ఆదేశిస్తూ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో అందుకు సంబంధించి రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా నిధులు కూడా చేరాయి. ఇందులో భాగంగా జిల్లాలో 244 పాఠశాలల్లోని 9వ తరగతి చదువుతున్న 15,183మంది విద్యార్థినీ విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్ళాల్సి వుంది. విహార యాత్రలకు తీసుకెళ్లిన తర్వాత అందుకు సంబంధించిన వివరాలను ఆర్‌యంయస్ కార్యాలయంలో అందజేయాల్సి వుండగా ఇప్పటి వరకు కేవలం 10 పాఠశాలల్లో కూడా విద్యార్థులకు విహార యాత్రలకు తీసుకెళ్లినట్లు కూడా తమకు వివరాలు అందలేదని ఆర్‌యంయస్ అధికారుల ద్వారా తెలిసింది. విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్ళడానికి గత ఏడాది సెప్టెంబర్ మాసంలోనే నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది ప్రధానోపాధ్యాయులను ప్రశ్నించగా నిధులొచ్చినప్పటికీ గతేడాది పెద్ద నోట్ల రద్దు, తర్వాత విద్యార్థులకు పరీక్షల కారణంగా ఆలస్యం జరుగుతోందని కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా పాఠశాలలో వుండే ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్లినప్పుడు కొంతవరకు బాధ్యతగా వుండి ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా చూసుకోవాల్సి వుంటుందని అందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడంలేదని మరికొంతమంది ప్రధానోపాధ్యాయులు చెప్పుకొస్తున్నారు. కాగా పాఠశాలల అభివృద్ధి కోసం వచ్చే నిధుల్లో వాటి కోసం వినియోగించకుండా సొంత ఖర్చులకు ఉపయోగించుకుంటున్న కొంతమంది ప్రధానోపాధ్యాయులు కూడా లేకపోలేదని అదేవిధంగా విహార యాత్రల కోసం వచ్చిన డబ్బును కూడా స్వాహా చేసే అవకాశం లేకపోలేదని కొందరు ఉపాధ్యాయులే చర్చించుకోవడం విశేశం.
యాత్రలకు తీసుకెళ్లకపోతే నిధులెనక్కివ్వాల్సిందే...
* శ్రీరాములు, ఎడి, ఆర్‌ఎంఎస్
తొమ్మదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మొత్తాలను గత ఏడాది సెప్టెంబర్ మాసంలోనే ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 200 చొప్పున జమ చేశాం. వారు విహార యాత్రలకు తీసుకెళ్ళినట్లు అందుకు సంబంధించి వివరాలను మాకు తెలియబరచాల్సి వుంది. 244 పాఠశాలల్లో ఇప్పటికి కనీసం 10 పాఠశాలల్లో కూడా విహార యాత్రలకు తీసుకెళ్లినట్లు తమకు సమాచారం అందలేదు. ఒకవేళ విహార యాత్రలకు తీసుకెళ్లకపోతే ఆ నిధులను తిరిగి వెనక్కి పంపాల్సి వుంటుంది. అందులో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు.
కరవును కళ్లకు కట్టినట్లు చూపించాలి
* కలెక్టర్ కోన శశిధర్
* రేపు కరవు బృందం రాక
అనంతపురం సిటీ, జనవరి 21: ఈ నెల 23న జిల్లాలో కరవు పరిస్థితులను పరిశీలించడానికి జెకె రాథోడ్ నేతృత్వంలో రానున్న కేంద్ర కరవు బృందానికి జిల్లా కరవు దుస్థితిని కళ్లకు కట్టినట్లుగా చూపించాలని కలెక్టర్ కోన శశిధర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో జెసి బి.లక్ష్మికాంతంతో కలసి వ్యవసాయ, అనుబంధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేకంగా సమావేశమై కేంద్ర కరవు బృందం పర్యటన ఏర్పాట్లను, అధికారులు సిద్ధం చేసిన నివేదికలను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లు చూసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా రైతన్నలకు కరవు నిబంధనల ప్రకారం గరిష్టంగా కేంద్ర నిధులు మంజూరు కావడానికి తగినట్లు వాస్తవ నివేదికలను, పవర్‌పాయింట్, ఫొటో ఎగ్జిబిషన్, క్షేత్ర పర్యటనకు ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ ద్వారా గత ఖరీఫ్‌లో వివిధ పంటలను సాగుచేసి, కరవు, వర్షాభావం వల్ల జరిగిన వేరుశెనగ తదితర పంట నష్టం వివరాలను సంపూర్ణంగా క్రోడీకరించి, విత్తనం వేసినప్పటి నుండి పంట ఆఖరు దశ వరకు వర్షాభావం వల్ల ఏవిధంగా రైతులు నష్టపోయిన అంశాన్ని దశలవారీగా ఛాయాచిత్రాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వెంటనే సిద్ధం చేయాలన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఎంత కావాలో నివేదికను సిద్ధం చేయాలని జెడిఏ శ్రీరామమూర్తి, సిపిఓ సుదర్శనంలను కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే పశుసంవర్థక, తాగునీటి శాఖ, సెరికల్చర్, భూగర్భ జలవనరులను, హార్టికల్చర్, ఎంపిఎంఐపి, డ్వామా శాఖలు ప్రస్తుతం తయారుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మార్పులు, చేర్పులు చేసి కరవు, వర్షాభావం ఎన్ని సంవత్సరాల నుండి మన జిల్లా రైతన్నలను వేదిస్తోందన్న అంశాన్ని బాగా చూపి దాని వల్ల జిల్లా ప్రజలు, రైతన్నలు ప్రతి ఏటా ఏవిధంగా నష్టపోతున్నారన్న అంశాలను అన్ని జిల్లాల్లో చూపించాలన్నారు. అలాగే గత ఖరీఫ్, ప్రస్తుత రబీలో కరవు వల్ల జరిగిన నష్టం, కావాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, తాత్కాలిక సహాయక చర్యలు, కరవు సహాయక శాశ్వత చర్యల కోసం ఎంత నిధులు కావాలో అంశాలపై ప్రతి శాఖ స్పష్టంగా నివేదికలను సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశిస్తూ కేంద్ర కరవు బృందం ద్వారా జిల్లా ప్రజలు, రైతన్నలకు గరిష్టంగా నిధులు వచ్చేలా అధికారులు వాస్తవ నివేదికలను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి, జెడిఏ, పశు సంవర్థక శాఖ జెడి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

గుట్టుగా బిల్లులు చెల్లిస్తారా?
* కమిషనర్ ఇంటి వద్ద మేయర్, ఎమ్మెల్యే వర్గీయుల ఘర్షణ
అనంతపురంటౌన్, జనవరి 21: గుట్టుగా బిల్లులు రాసేస్తున్నారన్న అపోహతో శనివారం స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలోని కమిషనర్ స్వగృహం వద్ద మేయర్, ఎమ్మెల్యే వర్గీయులు ఘర్షణపడ్డారు. కమిషనర్ ఇంటి నుంచి వెళ్తున్న అకౌంటెంట్ దేవశంకర్‌ను పట్టుకోవాలని మేయర్ వర్గీయులు జనార్ధన్, వీరేశ్ తదితరులు ప్రయత్నించటంతో ఎమ్మెల్యే వర్గీయుడైన సద్దల శేఖర్ వారిని అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో తమ చొక్కా పట్టుకున్నారని ఇరు వర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు. ఘర్షణ సమాచారం తెలియటంతో మీడియా అక్కడకు రావటం చూచి ఇరు వర్గాలు జారుకున్నారు. వన్ టౌన్ సిఐ రాఘవన్ సిబ్బందితో అక్కడకు చేరుకుని కమిషనర్ సురేంద్రబాబును ఘటన గురించి ఆరా తీశారు. కమిషనర్ మాట్లాడుతూ తాను స్నానం చేస్తుండగా కొందరు వ్యక్తులు బాగా తాగి వచ్చి బయటకు రావాలని అరవటం వినిపించిందన్నారు. తర్వాత వాకబు చేయగా మేయర్ వర్గానికి చెందిన జనార్ధన్ తదితరులు వచ్చి గొడవ పడుతున్నట్లు తెలిసిందన్నారు. తాను బయటకు వచ్చేసరికి ఎవరూ లేరని తెలిపారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కమిషనర్ సురేంద్రబాబుకు ఫోను చేసి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని, అత్యవసర సర్వీసైన వాటర్ వర్క్స్, ఇ-ప్రొక్యూర్‌మెంట్ బిల్లులు తప్పించి మరే బిల్లులు ఇవ్వవద్దని సూచించారు. తర్వాత కమిషనర్ విలేఖరులతో మాట్లాడుతూ నగర పాలక సంస్థకు చెడ్డపేరు రాకూడదన్న ఉద్దేశ్యంతోనే తనకు మేయర్ ఛాంబర్‌లో జరిగిన అవమానాలను బయటకు చెప్పుకోలేకపోతున్నానని అన్నారు.