మెదక్

పేట బల్దియాలో ముదిరిన అంతర్యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, జనవరి 21: ప్రజాసమస్యల పరిష్కారానికి అడ్డంకిగా మారిన చైర్ పర్సన్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేనిపక్షంలో తామే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవుతామని సదాశివపేట మున్సిపాలిటీకి చెందిన మొత్తం 18 మంది కౌన్సిలర్లు సవాల్ విసురుతున్నారు. గత కొంత కాలంగా కొనసాగుతున్న అంతర్యుద్ధం చిలికిచిలికి గాలివానగా మారింది. కౌన్సిల్ సభ్యులను లెక్క చేయకుండా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్న చైర్‌పర్సన్ వ్యవహార శైలిని సహించలేక పార్టీలకు అతీతంగా వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథంతో కౌన్సిలర్లు జతకట్టి చైర్ పర్సన్‌పై ఉద్యమానికి తెరలేపారు. పలుమార్లు ఇలాంటి తగాదాలు చోటుచేసుకోగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కల్పించుకుని నచ్చజెప్పడంతో పరిస్థితులు చక్కబడినా మళ్లీ మొదటికొచ్చి కూర్చుంది. గత యేడాది డిసెంబర్ 1వ తేదీన వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించగా అందులోని అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిల్ ఆమోదించిన అంశాలను సిడి డిఎంఎకు లిఖితపూర్వకంగా రాసిపంపినట్లు కమిషనర్ సభ్యులకు సమాధానం ఇచ్చారని, అందుకు సంబంధించిన వివరాలను తమకు తెలియజేకుండా గోప్యంగా ఉంచడంలో రహస్యం ఏమిటనే అనుమానాలను పిల్లోడి వర్గం వ్యక్తం చేస్తోంది. అధికారుల నిర్లక్ష్యంపై పలుమార్లు పత్రికల ద్వారా వెల్లడించినా సిడి డిఎంఎ నుంచి కూడా స్పందన లేదని చైర్‌పర్సన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్గం ఆరోపిస్తుంది. ఈ మేరకు శనివారం నాడు 18 మంది సభ్యులు సమావేశమై తిరుగుబాటుకు తెరలేపారు. రెండు నెలలుగా సమావేశం నిర్వహించకుండా చైర్‌పర్సన్ దాట వేస్తున్నారని విమర్శిస్తున్నారు. అధికారులు సైతం చైర్‌పర్సన్‌కు కొమ్ము కాస్తున్నారని, దీంతో పట్టణంలో అభివృద్ధి పనులు స్తంభించిపోయి ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమావేశం నిర్వహిస్తే సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేకనే చైర్‌పర్సన్ వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన చైర్ పర్సన్ పట్నం విజయలక్ష్మి నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని 18 మంది సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తామే రాజీనామాలు చేసి కౌన్సిల్‌ను మైనార్టీలో పడవేస్తామని, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని శపథం చేస్తున్నారు. కాగా చైర్‌పర్సన్ ఎన్నిక సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల పదవీ కాలం పూర్తయిందని, ఒప్పందం ప్రకారం పదవి నుంచి తప్పుకోవాలని మరో డిమాండ్‌ను సభ్యులు లేవనెత్తుతున్నారు. అధికార పార్టీకి చెందిన మరికొంత మంది సభ్యులు చైర్‌పర్సన్‌కు అండగా ఉండటంతో రెండున్నర సంవత్సరాల పదవీ కాలం ఒప్పందం ప్రకారంగా పదవి నుంచి తప్పుకునే అవకాశం లేకపోవడంతో సభ్యులు ఏకంగా రాజీమానా చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేస్తే మళ్లీ గెలుస్తామా? అన్న ఆలోచనలో కూడా కొంత మంది కౌన్సిలర్లు ఉండగా కేవలం మేకపోతు గాంభీర్యం కోసమే చైర్ పర్సన్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలు అసంతృప్తి వర్గం ఎదుర్కొంటుంది. పార్టీ పెద్దలు కల్పించుకుని రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చే అవకాశం లేకపోలేదు. మొత్తంమీద సదాశివపేట బల్దియా పాలక మండలిలో ఏర్పడిన సంక్షోభంతో అభివృద్ధి కార్యక్రమాలకు శరాఘాతంగా మారిందని చెప్పవచ్చు. వివాదం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

కెసిఆర్ సంక్షేమ పథకాలకు దేశవ్యాప్త ప్రసంశలు
పెద్దశంకరంపేట, జనవరి 21: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని నారాయఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. శనివారం స్ర్తిశక్తి భవనంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించిన 9 మంది మహిళలకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల దేశంలోని ప్రజలు పలు రాష్ట్రాల ప్రభుత్వాధి నేతలు మెచ్చుకుంటున్నారన్నారు. పేద ఇంటిలో అమ్మాయి పుట్టిందనే బెంగ తల్లిదండ్రులకు ఉండవద్దనే ఆలోచనతోనే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు పెళ్లి చేస్తే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకింద రూ.51 వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో వికలాంగులు, వితంతువులు, వృద్ధాప్య, చేనేత పెన్షన్లను గత ప్రభుత్వాలు ఇచ్చేవని, కానీ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లను వెయ్యి రూపాయలకు పెంచిందని గుర్తు చేశారు. అలాగే ఒంటరి మహిళకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో పెన్షన్లను ఇవ్వడం కెసిఆర్ గొప్పతనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధించాలంటే ప్రజలు కూడా ప్రభుత్వానికి మద్దతునిస్తూ ప్రభుత్వ పథకాలను నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిపి రాయిని సంగమేశ్వర్, పేట సర్పంచ్ జంగం శ్రీనివాస్, ఎంపిటిసి సభ్యులు వేణుగోపాల్‌గౌడ్, సుభాష్‌గౌడ్, మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.