క్రీడాభూమి

ఇస్టోమిన్‌కు దిమిత్రోవ్ కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగిన ఉజ్బెకిస్తాన్ ఆటగాడు డెనిస్ ఇస్టోమిన్ దూకుడుకు రష్యా స్టార్ గ్రిగరీ దిమిత్రోవ్ కళ్లెం వేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 117వ స్థానంలో ఉన్న ఇస్టోమిక్ రెండో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే ఊపుతో అతను మూడో రౌండ్‌లో కారెనో బస్టాను ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. అయితే, క్వార్టర్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. దిమిత్రోవ్ అతనిపై 2-6, 7-6, 6-2, 6-1 తేడాతో గెలుపొంది, కెరీర్‌లో రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. అతను సెమీస్‌లో స్థానం కోసం 11వ సీడ్ డేవిడ్ గోఫిన్‌ను ఢీ కొంటాడు. మరో ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో గోఫిన్ 5-7, 7-6, 6-2, 6-2 ఆధిక్యంతో డామినిక్ థియెమ్‌పై విజయం సాధించాడు.

చిత్రం..గ్రిగరీ దిమిత్రోవ్