క్రీడాభూమి

విజ్‌డెన్ ఇయర్ బుక్‌పై విరాట్ కోహ్లీ ఫొటో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ‘క్రికెట్ బైబిల్’ విజ్‌డెన్ పత్రిక 2017 ఇయర్ బుక్‌పై అతని ఫొటో దర్శనం ఇవ్వనుంది. 2016లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన కోహ్లీ అన్ని ఫార్మాట్స్‌లో కలిపి మొత్తం 2,517 పరుగులు సాధించి, మిగతా ఆటగాళ్ల కంటే ముందున్నాడు. ఈ ఘనత వల్లే అతను ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో విడుదలయ్యే విజ్‌డెన్ ఇయర్ బుక్ కవర్ పేజీకి ఎంపికయ్యాడు. టెస్టుల్లోగానీ, వనే్డ ఫార్మాట్‌లోగా కోహ్లీ రివర్స్ స్వీప్ చేయడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఫొటోనే విజ్‌డెన్ ఎంపిక చేయడం విశేషం. దీనిపై పుస్తకం ఎడిటర్ లారెన్స్ బూత్ వివరణ ఇచ్చాడు. సహజంగా విజ్‌డెన్ అనగానే సంప్రదాయాలను ఎక్కువగా పాటించడమే గుర్తుకొస్తుందని, కానీ కాలానికి అనుగుణంగా మారుతున్నామని బూత్ పేర్కొన్నాడు. అందుకే ఈసారి కొంత భిన్నంగా ఉండాలని అనుకున్నామని తెలిపాడు. కోహ్లీ రివర్స్ స్వీప్ చేస్తున్న ఫొటోను ఎంపిక చేయడం ద్వారా విజ్‌డెన్ మార్పును అందరికీ తెలియచేస్తున్నామని వ్యాఖ్యానించాడు.

విజ్‌డెన్‌ఇయర్ బుక్‌పై దర్శనమిచ్చిన రెండో భారత క్రికెటర్ కోహ్లీ. ఇంతకు ముందు ఈ ఘనత సచిన్ తెండూల్కర్‌కు దక్కింది. అతని ఫొటోను 2014లో విజ్‌డెన్ పత్రిక కవర్ పేజీపై ముద్రించింది. కాగా, ఆసియాలో జన్మించిన క్రికెటర్లలో ఈ ఘనత సచిన్, కోహ్లీతోపాటు ఇంగ్లాండ్ ఆటగాడు మోయిన్ అలీకి కూడా లభించింది.