జాతీయ వార్తలు

ఇదేం అఫిడవిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఇండో-బంగ్లా సరిహద్దులో కంచె ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇండో-బంగ్లా సరిహద్దులో 263 కిలోమీటర్ల పొడవున కంచె నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. 2020 నాటికి ఫెన్సింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలు పొంతనలేకుండా ఉన్నాయని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అఫిడవిట్‌లోని ఓ పేరాలో పేర్కొన్న వివరాలు అసంబద్ధంగా ఉన్నాయంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవ పరిస్థితులను అఫిడవిట్‌లో పొందుపరచలేకపోయారని కోర్టు ఆక్షేపించింది. దీనిపై సమగ్ర సమాచారం సమర్పించాలని హోమ్‌శాఖను ధర్మాసనం ఆదేశించింది.