జాతీయ వార్తలు

విద్వేష నేరాలను సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 8: ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే విద్వేష నేరాలపై కొత్త చట్టం రూపొందిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కులం, మతం, లింగం ఆధారంగా ఉద్రిక్తతలు సృష్టించే వారికి ఎక్కువ శిక్ష పడేలా ఈ చట్టంలో నిబంధనలు పొందుపరచడం జరుగుతుందని పేర్కొంది. ‘ప్రతి ఎన్నికలోనూ విద్వేష, విచ్ఛిన్నకర అజెండా ముందుకు వస్తున్నది స్పష్టమే’ నంటూ పరోక్షంగా బిజెపిని నిందించింది. పోలీసులు క్రూరంగా వ్యవహరించిన, జులుం ప్రదర్శించిన కేసులను పరిష్కరించడానికి ఒక పోలీసు అంబుడ్స్‌మన్‌ను నియమిస్తామని హామీ ఇచ్చింది. నేరపూరిత అణచివేత సంఘటనల్లో బాధితులకు తప్పనిసరిగా నష్టపరిహారం అందేందుకు వీలుగా క్రిమినల్ ఇంజూరీస్ కాంపెన్‌సేషన్ బోర్డ్ (సిఐసిబి)ని ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ బుధవారం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో.. మహిళల రక్షణకు గత యుపిఎ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేస్తామని, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని ఈ చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండగానే రూ. 50వేల నుంచి రూ. లక్ష వరకు లభించేట్లు ‘కన్యా సన్‌శక్తికరన్ యోజన’ పథకాన్ని ప్రవేశపెడతామని భరోసా ఇచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించే మహిళలకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తామని హామీ ఇచ్చింది. పంచాయతి ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. దళితుల్లో అత్యంత వెనుకబడి, అణచివేతకు గురవుతున్న గ్రూపులకు చెందిన ప్రజలు మంచి విద్య, ఉద్యోగాలను పొందేలా దోహదపడేందుకు వారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అన్ని పథకాలు ప్రజలకు అందేందుకు వీలుగా ఒక డైవర్సిటి కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి బ్లాక్‌లో ఒక ‘వికాస్ మిత్ర’ను నియమిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఒబిసి కులాలకు చెందిన వారందరికీ ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని, దళితులపై జరిగే నేరాలకు సంబంధించి కేసులు దాఖలు చేయడానికి బాధితులకు సహకరించేందుకు ‘సురక్షా మిత్ర’ను నియమిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ కులాలకు చెందిన యువతుల వివాహానికి అదనపు గ్రాంట్లు అందజేస్తామని, వారు స్వంతంగా వ్యాపారం చేసుకోవడానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని, వైద్య, గృహ సౌకర్యాలను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

అన్నివేళలా బడి ‘్భద్రం’ కాదు!

దేశంలో మూడింట ఒక వంతు చిన్నారుల అభిప్రాయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తాము చదివే పాఠశాల ఎల్లవేళలా సురక్షితం కాదని దేశంలోని ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు అభిప్రాయ పడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్కూలు పిల్లల మనోగతంపై జరిపిన ఓ అంతర్జాతీయ సర్వే నివేదిక పేర్కొంది.
చదువు ముఖ్యమైన విషయమని ఈ దేశాల్లోని పిల్లలందరూ ఏకీభవిస్తున్నప్పటికీ తాము చదివే బడి కొన్ని సందర్భాల్లో మాత్రమే సురక్షితమని మన దేశంలో ఈ సర్వేలో పాల్గొన్న పిల్లల్లో మూడింట ఒకవంతు మంది మాత్రమే చెప్పడం గమనార్హం. అంతర్జాతీయంగా ఇది 31గా శాతం ఉండగా, భారత్‌లో 28 శాతమే ఉందని ‘చైల్డ్ ఫండ్ అలయెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ సర్వే నివేదిక పేర్కొంది.

భారత్, అఫ్గానిస్తాన్, జాంబియా, కంబోడియా లాంటి 31 అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటుగా మొత్తం 41 దేశాల్లో 10-12 ఏళ్ల మధ్య వయసుకల 6,226 మంది పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు.
పాఠశాలలో సురక్షితంగా ఉండడం అంటే స్కూలు బిల్డింగ్, సదుపాయాలు పరిశుభ్రంగా, మంచిస్థితిలో ఉండడమని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పిల్లల్లో 21 శాతం మంది అభిప్రాయ పడ్డారు. భారత్‌లో ఇది 58 శాతంగా ఉంది. స్కూల్లో క్షేమంగా ఉండడం అంటే పరిశుభ్రమైన, సురక్షితమైన భవనం, కొత్తవాళ్లనుంచి రక్షణ, టీచర్ల పర్యవేక్షణలాంటివని మన దేశంలో పిల్లలు చెప్పడం గమనార్హం. ‘స్మాల్ వాయిస్, బిగ్ డ్రీమ్స్’ పేరుతో రూపొందించిన ఈ సర్వే నివేదికను బుధవారం కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అతవాలే న్యూఢిల్లీలో విడుదల చేశారు. కాగా, పాఠశాలల్లో భద్రత కరువు కావడం ఆందోళన కలిగించే అంశమని, సురక్షితమైన వాతావరణంలో చదువుకోవడం ప్రతి చిన్నారి హక్కనే విషయంపై మనమంతా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని చైల్డ్ఫ్‌ండ్ ఇండియా జాతీయ డైరెక్టర్ నీలమ్ మఖిజాని అన్నారు.