హైదరాబాద్

ఆస్తిపన్ను వసూలులో గాంధీ గిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: గ్రేటర్ నగరంలోని కోటి మంది జనాభాకు అతి ముఖ్యమైన పౌరసేవలందించే జిహెచ్‌ఎంసికి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్నును లక్ష్యానికి తగిన విధంగా వసూలు చేసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కమిషనర్ జోనల్, సర్కిళ్ల స్థాయి అధికారులకు టార్గెట్లు విధించి, ఎప్పటికపుడు కలెక్షన్‌ను పర్యవేక్షిస్తున్నారు. వసూళ్లను మెరుగుపర్చుకునేందుకు ఈ నెల 19న ఆదివారం అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రాపర్టీ ట్యాక్సుకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే దీర్ఘకాలంగా వసూలు కాని మొండి బకాయిలు, అలాగే రెండు, మూడు సంవత్సరాల నుంచి పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసుకునేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు గాందీగిరితో వ్యవహరించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. గతంలో ఈ మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు అధికారులు తొలుత రెడ్ నోటీసులు జారీ చేసేవారు. ఆ తర్వాత బకాయిదారుడికి కాస్త సమయమిచ్చి, ఆ తర్వాత ఇంట్లోని సామాగ్రిని స్వాధీనం చేసుకునే వారు. అయితే ఈ రకంగా స్వాధీనం చేసుకున్న సామాగ్రిని ఎక్కడ పెట్టుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత ఈ విధానానికి స్వస్తి పలికిన జిహెచ్‌ఎంసి అధికారులు భవనాలను సీజ్ చేయటం, లేదంటే పెద్ద మొత్తంలో బకాయి పడ్డ భవనం ముందు చెత్త వాహనాలను పార్కింగ్ చేయటం వంటి చర్యలు చేపట్టారు. ఈ రకమైన చర్యలపై గతంలో న్యాయస్థానం మొట్టికాయలు వేయటంతో ఈ విధానానికి సైతం గుడ్‌బై చెప్పిన జిహెచ్‌ఎంసి అధికారులు కొద్దిరోజుల క్రితం స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 కార్యక్రమంలో భాగంగా నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్త వేసేవారిని, అలాగే బహిరంగ మల,మూత్ర విసర్జన చేస్తున్న వారిని గుర్తించి వారిని పూలదండతో సత్కరించే కార్యక్రమాలను నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి సందేశం చాలా సులువుగా వెళ్లటంతో పాటు సత్ఫలితాలివ్వటంతో ఇపుడు ఆస్తిపన్ను వసూలుకు కూడా గాంధేయ మార్గాన్ని అనుసరించాలని భావిస్తున్నారు. అయితే గాంధీమార్గంలో పన్ను వసూలు చేసుకుని, లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించిన కమిషనర్ ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలన్న విషయంపై స్పష్టత ఇవ్వకపోవటంతో గతంలో మాదిరిగా బకాయి పడ్డ భవనం ముందు గంట కొట్టాలా, లేక డప్పులు కొట్టాలా, లేదంటే ఏకంగా బ్యాండు మేళాలు మోగించాలా? అన్న అంశంపై సర్కిల్ స్థాయిల్లోని డిప్యూటీ కమిషనర్లు తమ వెసులుబాటును బట్ట్టీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. కానీ పెద్ద మొత్తంలో బకాయిలున్న భవనం ముందు వౌనంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేయాలని మరికొందరు అధికారులు భావిస్తున్నారు. ఏ మార్గమైతేనేం బకాయిదారుడు స్పందించి పన్ను చెల్లించేలా, తమ టార్గెట్‌ను అధిగమించేలా నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది సిద్దమవుతోంది.
కొనసాగుతున్న ‘సునామీ’ సర్వే
నగరంలో రూ. 1200లోపు ఆస్తిపన్ను చెల్లించే వారికి ప్రభుత్వం గతంలో రూ. 101కు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫర్‌కు అసలైన అర్హులను గుర్తించేందుకు జిహెచ్‌ఎంసి కొద్ది నెలల క్రితం రూ. 1200లోపు పన్ను చెల్లించే సుమారు 5లక్షల 30వేల వరకుండగా, వీటిలో అధికారులు ఇప్పటి వరకు 4లక్షల 30వేల ఖాతాలను రీ సర్వే చేయగా, అదనంగా రూ. 69 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. మిగిలిన మరో లక్ష ఖాతాలను కూడా రీ సర్వే చేస్తే మరో రూ. 11 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశమున్నట్లు చీఫ్ వ్యాల్యుయేషన్ ఆఫీసర్ గీతారాధిక తెలిపారు.