జాతీయ వార్తలు

గూండాల రాజ్యం..యూపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 19: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలను కాపాడటంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) ప్రభుత్వం విఫలమయిందని, రాష్ట్రంలో ‘గూండాల రాజ్యం’ నడుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రేప్ కేసులో ఒక మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది అని ఆదివారం ఇక్కడ బిజెపి నిర్వహించిన ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ అన్నారు. అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేశాక యుపి పోలీసులు శనివారం కళంకిత మంత్రిపై.. గ్యాంగ్ రేప్‌కు, ఒక మహిళ, ఆమె మైనర్ కుమార్తెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారనే అభియోగాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ‘దీంతో అఖిలేశ్ యాదవ్ ముఖంలో వెలుగు పోయింది. అతని గొంతు జీరబోయింది. మీడియాతో మాట్లాడుతుండగా అతను భయపడ్డారు’ అని మోదీ అన్నారు. ‘యుపిలో పోలీసు వ్యవస్థ ఇంత అసమర్థంగా ఎందుకుంది? ప్రజల ఫిర్యాదులను ఎందుకు నమోదు చేయడం లేదు? ఇదేం సంస్కృతి? రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరచడానికి సమాజ్‌వాదీ పార్టీ ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు’ అని ఆయన విరుచుకుపడ్డారు. ప్రజల భద్రతకు భరోసానిచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాపతి తరపున అఖిలేశ్ ప్రచారం చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, కాంగ్రెస్-ఎస్‌పి కూటమి.. గాయత్రి ప్రజాపతి అంత పవిత్రమైనదా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రతిష్ఠాత్మక అమేథీ నియోజకవర్గం నుంచి ప్రజాపతి పోటీ చేస్తున్నారు. ప్రజాపతిని 2016లో తన మంత్రివర్గం నుంచి తొలగించిన అఖిలేశ్ యాదవ్ తరువాత తిరిగి తీసుకున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంద్వారా సమాజ్‌వాదీ పార్టీ.. సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియాను అవమానించిందని మోదీ విమర్శించారు. ‘అసామాన్య అధికారం గల సౌభాగ్యవంతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి క్షేత్ర స్థాయిలో పరిస్థితి తమకు అనుకూలంగా లేదని గ్రహించారు. ఈ కారణంవల్లనే ‘27 సాల్, యుపి బేహాల్’ నినాదమిచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్పనిసరయి ఎస్‌పితో జట్టు కట్టింది’ అంటూ ఆయన పరోక్షంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత పదేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడా అభివృద్ధి లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.
chitram...
యుపిలోని ఫతేపూర్‌లో ఆదివారం నిర్వహించిన బిజెపి ఎన్నికల బహిరంగ సభలో ఓటర్లకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, స్థానిక నేతలు