హైదరాబాద్

కినె్నర ‘పద్యనాటకోత్సవాలు’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: మరుగున పడిపోతాయనుకునే పద్యనాటకాలకు ఉత్సవాల పేరుతో ప్రోత్సహిస్తున్న కినె్నర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలో పద్యనాటకోత్సవాలను ప్రారంభించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆచార్య సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ కృష్ణపక్షం అనగానే దేవులపల్లి కృష్ణశాస్ర్తీ గుర్తుకు వస్తారని చెప్తూ శ్రీకృష్ణ దేవరాయల, అప్పాజీల సమన్వయ సన్నివేశాల ‘కృష్ణపక్షం’ నాటకం ప్రదర్శిస్తున్న కళాకారులను అభినందించారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న విశ్రాంత ఐఎఎస్ అధికారి బి.వి.రామారావు మాట్లాడుతూ పద్యనాటకం మరుగున పడుతున్న కళ అని చెప్తూ ఇంగ్లీష్ మీడియం చదువులతో తెలుగు భాష సరిగ్గా మాట్లాడలేని బాలలు కళలను విజయవంతం చేయడానికి తమకు నచ్చిన కళల్లో ప్రావీణ్యతను సంపాదిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ పద్య నాటకాల ప్రదర్శన సాహసంతో కూడినదని, విదేశాల్లో కూడా పద్యనాటకాలకు ఆధరణ పెరుగుతోందని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సలహాదారులు కె.వి.రమణాచారి మాట్లాడుతూ ఆడిటోరియంలో ప్రేక్షకులు తక్కువగా వున్నారంటూ ఉల్లి తోటలో జనం ఎక్కువ బంగారుగని దగ్గర తక్కువ అంటూ పద్య నాటకాన్ని బంగారుగనితో పోల్చారు. నంది నాటకోత్సవాలలో పద్యనాటకంతో కొత్త శోభ సంతరించుకుందని చెప్తూ పద్యనాటకాల అనుభూతిని హాస్వాదిద్దాం అని అన్నారు. కినె్నర అధ్యక్షులు ఆర్.ప్రభాకరరావు స్వాగతం పలుకగా కార్యదర్శి మద్దాలి రఘురామ్ వందన సమర్పణ చేశారు. ప్రారంభోత్సవ నాటకంగా మిర్యాలగూడ సాంస్కృతిక కళాబృందం ‘కృష్ణపక్షం’ నాటకాన్ని ప్రదర్శించారు. తడకమళ్ళ రాంచందర్‌రావు దర్శకత్వంలో కృష్ణ దేవరాయలుగా ఆర్.ప్రసాద్, మహామంత్రి తిమ్మరుసు (అప్పాజి)గా పిసిపి దాస్, అచ్యుతరాయలుగా ఎస్‌కె ముస్త్ఫా, బ్రహ్మనాయుడుగా పి.కృష్ణమూర్తి తదితరులు నటించిన ఈనాటకానికి సంగీతం కెఎస్‌ఎన్ శర్మ, లక్ష్మీనారాయణశర్మ, పానుగంటి చంద్రశేఖర్ సమకూర్చారు.