జాతీయ వార్తలు

ఢిల్లీ వర్శిటీ టీచర్లు విద్యార్థుల నిరసన ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: స్వేచ్ఛా గళాలను నొక్కివేస్తున్నారంటూ వేలాది మంది ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధులు, అధ్యాపకులు మంగళవారం ఎబివిపికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ జరిపారు. తనపై అత్యాచారం జరుపుతామంటూ బెదిరింపులు వచ్చాయని ప్రకటించి సంచలనం రేపిన గుర్‌మెహర్ కౌర్ ఎబివిపికి వ్యతిరేకంగా తన నిరసనను విరమించుకున్నారు. నేటి ర్యాలీలో పాల్గొనని గుర్‌మెహర్ ‘నన్ను వదిలేయండి’ అంటూ అభ్యర్థించారు. గుర్‌మెహర్ ప్రకటన సామాజిక మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. నేటి ర్యాలీలో జెఎన్‌టియు విద్యార్ధులు, మేధావులు, విద్యావేత్తలు కూడా పాల్గొన్నారు. ఢిల్లీ వర్శిటీసహా దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్శిటీల్లోనూ భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికి నిరసనగానే ఈ ర్యాలీ జరిపామని అఖిల భారత విద్యార్థుల సంఘం నాయకుడు కన్వల్‌ప్రీత్ కౌర్ తెలిపారు. గత వారం రాంజాస్ కాలేజీలో జరిగిన హింసాకాండ నేపథ్యంలో ఎబివిపిపై విమర్శలు తలెత్తాయి. ఎబివిపికి వ్యతిరేకంగా సామాజిక మీడియాలో ప్రచారానికి దిగడంతో 20ఏళ్ల గుర్‌మెహర్ కౌర్ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. తనకు అత్యాచార బెదిరింపులు వచ్చాయని ఆమె చెప్పడం పరిస్థితిని మరింత వేడెక్కించింది.

చిత్రం..మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన