ఖమ్మం

రాజకీయాలను శాసించే స్థాయికి మహిళలు ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), మార్చి 8: వంటింట్లో పొయ్యిల నడుమ జీవనాన్ని కొనసాగించి, కుటుంబానికి సేవ చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ, కుటుంబ పాలనతో ప్రారంభమైన వారి జీవితం ప్రస్తుతం రాష్ట్ర, దేశ రాజకీయాలను శాసించే స్థాయికి మహిళలు ఎదగాలని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌లు పేర్కొన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాలలో పోటీ పడటంతో పాటు విజయాలలో ముందుంటున్నారన్నారు. ప్రతి రంగంలో మహిళల పాత్ర ఎంతో ప్రముఖ్యతతో కుడుకొని ఉందని ఆదిశగా ముందుకు వెళ్ళినప్పుడే లక్ష్యాలను సాధించుకోగల్గుతారన్నారు. సమాజంలో విలువలను పెంచేందుకు విద్య ఎంతో దోహదపడుతుందని అలాంటి విద్యాలో మహిళలను 100శాతం అక్ష్యరాసులుగా సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ పునర్‌నిర్మాణ సాధనలో మహిళలు భాగస్వాములు కావాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీంటీంలను ఏర్పాటు చేసిందని తద్వారా మహిళలు వారి సమస్యలను పరిష్కరించుకోగల్గుతున్నారన్నారు. ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. అనంతరం మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఖమ్మం మేయర్ పాపాలాల్, జడ్పిచైర్‌పర్సన్ గడిపల్లి కవిత, కార్పొరేషన్ డిప్యూటి మేయర్ మురళి, కమిషనర్ బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.