ఉత్తరాయణం

అమెరికా ఉద్యోగాలు మన హక్కా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్హులు లేకపోతే ‘రిజర్వుడు కేటగిరీ’ కింద కళాశాలల్లో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంచేస్తారే తప్ప ఇతరులకు వాటిని కేటాయించరు. తమ కులాన్ని బిసి జాబితాలో చేర్చాలని కొందరు ఆందోళనలు చేస్తే- అలా కలిపితే సహించేది లేదని ఇప్పటికే ఆ జాబితాలో ఉన్నవారు ప్రతిఘటిస్తారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే అయినా ఇతర ప్రాంతాల వారు అక్కడ ఉద్యోగాలు చేయకూడదు, ఆస్తులు కొనరాదు. స్థానిక ముస్లింలు కాశ్మీర్ నుంచి హిందువుల్ని తగిలేసినా ఎవరూ నోరుమెదపరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే చదువులు, ఉద్యోగాలు జోన్లవారీగా సాగుతాయి. ఇవేవీ మనకు ఘోరాలుగా కనిపించవు. కానీ- అమెరికాలో ఉద్యోగం మన హక్కు అనుకుంటాం. ఆ హక్కుని హరిస్తున్నాడంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని తిట్టిపోస్తాం! వారెవా.. భారతీయులు..!
- మైథిలి, సర్పవరం

పేదరికమే కొలమానం
అణగారిన పేదల ఉద్ధరణకు భారత రాజ్యాంగం మొదటిసారి రిజర్వేషన్లను పది సంవత్సరాలకు కల్పిస్తే, ఆరు దశాబ్దాలు దాటిపోయినా ఇంకా కొన్ని కులాలను రిజర్వుడు కేటగిరీల్లో చేరుస్తూ ఆ విధానాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఇదంతా ఓటుబ్యాంకు రాజకీయాలలో భాగమని నాయకులకు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు మతపరమైన రిజర్వేషన్లకు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నాంది పలుకుతున్నాయి. కులమతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ రిజర్వేషన్లను అమలు చేయాలి. ఇంకా ఇతర కులాలు, మతాలకు వీటిని విస్తరించడం సరికాదు. కులం, మతం తప్ప వ్యక్తుల నైపుణ్యం, మేధస్సు వంటివి గుర్తుకురావా? ఆర్థిక వెనుకబాటును మాత్రమే పరిగణనలోకి తీసుకొని అర్హులను ఆదుకోవాలి.
- గర్నెపూడి వెంకట రత్నాకర్‌రావు, హన్మకొండ

గ్రంథాలయాలకు నిధులివ్వండి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో గ్రంథాలయాల అభివృద్ధికి తగినంతగా నిధులను కేటాయించాలి. రాష్ట్ర విభజన తరువాత గ్రంథాలయాల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. పోటీ పరీక్షల పుస్తకాలు తప్ప సాహిత్యం తదితర విభాగాల పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థలు కొనుగోలు చేయడం మానేసిన సంగతి తెలిసిందే. దీంతో పుస్తక రచయితలు, ప్రచురణ సంస్థలు, గ్రంథాలయాలకు వెళ్లే పాఠకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇక, స్థానిక సంస్థలు గ్రంథాలయాలకు సక్రమంగా సెస్ చెల్లించడం లేదు. ఫలితంగా గ్రంథాలయాలు బక్కచిక్కిపోతున్నాయి. దీంతో పాఠకులు గ్రంథాలయాల వైపుకనె్నత్తి చూడని స్థితి కొనసాగుతోంది. గ్రంథాలయాలు బతికిబట్టకట్టడానికి హెచ్చు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

సిమెంటు రోడ్లు వద్దు
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు వేయిస్తున్నది. ఇది గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడమట! నిజానికి ఇది వారిని కూలీలుగా మార్చడం! ఇది కూడా తాత్కాలికం. చేతివృత్తులతో, కుటీర పరిశ్రమలతో గ్రామీణులు స్వతంత్రంగా జీవించడానికి కావలసిన ఆర్థిక సాయం, తగిన శిక్షణ ఇవ్వడం ఉత్తమం. సిమెంటు రోడ్లు వేయిస్తూ భూమిలోకి నీరు ఇంకకుండా, భూగర్భ జలాలు లేకుండాచేసి నీటి కరవును సృష్టిస్తున్నారు. సిమెంటు రోడ్లు సూర్యరశ్మికి విపరీతంగా వేడెక్కి భూతాపం పెరిగి పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉంది.
- బి.సత్యప్రకాశ్, సూర్యాపేట

ఆ చట్టం జాడలేవీ?
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద పిల్లలకు ఉచితంగా ఇవ్వాలని విద్యాహక్కు చట్టం చెబుతున్నా, ఏ ఒక్క ప్రైవేటు పాఠశాలలో నిబంధనలు అమలుకావడం లేదు. ఈ చట్టం అమలు జరిగితే బీద విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికైనా చట్టం అమలుచేసి, పేద విద్యార్థులకు న్యాయం చేయాలి.
- కె.వౌనిక, మధురవాడ