కర్నూల్

చక్కర్లు కొడుతున్న హెలికాఫ్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, మార్చి 20: మండలంలో గత నాలుగు రోజులుగా హెలికాఫ్టర్ భూమికి చేరువలో చక్కర్లు కొడుతోంది. దీనిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక రోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఒక రోజు హెలికాఫ్టర్‌కు ఒక చక్రాన్ని ఏర్పాటు చేసుకొని చక్కర్లు కొట్టింది. దీనిపై ప్రజలు పరి పరి విధాలుగా చర్చించుకుంటున్నారు. నల్లమల అభయారణ్యం సమీపంలో ఈ హెలికాఫ్టర్ చెక్కర్లు కొడుతుండడంతో నక్సలైట్ల కదలికలను గుర్తించడానికా? లేక భూమిలో ఖనిజ నిక్షేపాలను గుర్తించడానికో ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ హెలికాఫ్టర్ ఎందుకు చక్కర్లు కొడుతుందన్నది ఎవరికి తెలియలేదు. పొలాలను సర్వే చేస్తూ మండలంలోని అల్లీనగరం, తమడపల్లె, బుక్కాపురం పొలాల్లో ఎక్కువ సేపు ఆగి సర్వే చేస్తుంది. రైతుల మనసులో కొంత ఆందోళన కలిగించే ఈసర్వే రైతుల గుండెల్లో గుబేలు పడుతుంది. పొలాలను ప్రభుత్వం స్వాధీన పరచుకొనేందుకా? ఇక్కడ నిధి నిక్షేపాలను కనుగొనేందుకా? అని రైతులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అధికారులు ఒక ప్రకటన చేస్తే తప్ప రైతుల్లో, ప్రజల్లో ఆందోళన పోయేలా లేదు.
యథేచ్ఛగా నకిలీ తేనె విక్రయం!
మహానంది, మార్చి 20: మండలంలోని నంద్యా-గిద్దలూరు రహదారిలోని సర్వలక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో కొందరు నకిలీ తేనెను విక్రయిస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పట్టిక, కుళ్లిన పండ్లు, కూరగాయలతో తయారు చేసే ఈ నకిలీ తేనెను రహదారి పక్కన ఉంచుతూ బాటసారులను మోసం చేస్తూ ఈ నకిలీ తేనెను విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఐటిడిఎ అధికారులు దాడులు చేసి హెచ్చరించారు. గత కొంత కాలం ఆగినా మళ్లీ ఈ విక్రయాలు ప్రారంభం అయ్యాయి. అప్పట్లో అధికారి ఈ తేనెను తాగితే నపుంసకత్వం రావడం, పిల్లలకు ప్రాణాంతక వ్యాధులు రావడం జరుగుతుందని, దాడులు చేసి దాదాపు వంద బాటిళ్లు స్వాదీనం చేసుకున్నారు. ఈ తేనె విక్రయదారులను ప్రశ్నించగా మేము జీవనోపాధి కల్పించుకోవాలి కదా అని సమాధానం చెబుతున్నారు. కల్తీ తేనె విక్రయాలను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

శిల్పా గెలుపులో ఆదోని,
ఆలూరు డివిజన్ ఓట్లే కీలకం
ఆదోని, మార్చి 20: స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పాచక్రపాణిరెడ్డి గెలుపులో ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో ఉన్న ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలే కీలకంగా మారినట్లు వచ్చిన స్వల్ప మెజార్టీ స్పష్టం చేస్తుంది. టిడిపి అభ్యర్థి శిల్పాచక్రపాణిరెడ్డికి వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు ప్రారంభం నుంచి వైకాపా, టిడిపి హోరాహోరీ పోరు సాగించాయి. అయితే ఎన్నికలకు మూడు రోజుల ముందు ఒత్తిడిలు, ప్రలోభాలు భారీగా పెరగడంతో తెలుగుదేశం అభ్యిర్థి పరిస్థితి మెరుగైంది. అయినప్పటికి శిల్పాచక్రపాణిరెడ్డికి గత ఎన్నికల్లో 147 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాని ఇప్పుడు కేవలం 64 ఓట్ల మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, మంత్రి కెయి కృష్ణమూర్తి ఈసారి 300 ఓట్లు మెజార్టీ వస్తుందని సభలో ప్రకటించారు. అయితే శిల్పా ఉండే స్వంత ప్రాంతంలోనే ఓట్లకు భారీ గండి పడిందని ఎన్నికలకు ముందే భారీ ప్రచారం జరిగింది. వచ్చిన మెజార్టీ చూస్తే ఆప్రచారం నిజమైనట్లు స్పష్టం అవుతుంది. ఈ ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి విజయం సాధించడానికి ఆదోని, ఆలూరు నియోజకవర్గాల ఓట్లు కీలకంగా మారాయి. ఆదోని నియోజకవర్గంలో వైకాపాకు స్థానిక సంస్థల్లో పూర్తి మెజార్టీ వచ్చింది. అయితే ఆదోనిలో ఇస్వీ, పెద్దతుంబళం, హానవాల్‌కు చెందిన ఎంపిటిసిలు, అలాగే మండల అధ్యక్షురాలు పద్మావతిలు తెలుగుదేశంలో చేరిపోయారు. అంతేకాకుండా మున్సిపాల్ కౌన్సిలర్ల కూడా చాలా మంది టిడిపి ఓటు వేసేలా చేయడంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, వారి సోదరులు ఉమాపతి నాయుడు చేసిన శ్రమ ఫలించింది.
అందువల్ల ఆదోని నియోజకవర్గంలో ఐదు నుంచి ఎనిమిది ఓట్లు టిడిపికే అధికంగా వచ్చినట్లు అంచనా. ఇక ఆలూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రతినిధులు 90 వరకు ఉండగా ఆలూరు టిడిపి ఇన్‌ఛార్జి వీరభద్రగౌడ్, దాదాపు 75 మంది ఎంపిటిసిలు, జడ్పీటీసీల ఓట్లు స్వయంగా వాహనాల్లో తీసుకొచ్చి వేయించడం జరిగింది. ఆలూరు నియోజకవర్గంలో ఒకేసారి టిడిపికి 80 ఓట్లు దాకా పడడంతో శిల్పా చక్రపాణిరెడ్డి విజయంలో ఆలూరు నియోజకవర్గం ఓట్లు చాలా కీలకంగా మారినట్లు స్పష్టం అవుతుంది. అలాగే మార్లమడికి ఎంపిటిసి మోహన్‌రాజు ఓటు కూడా వేయించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే మోహన్‌రాజు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. ఈవిధంగా శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీగా గెలవడానికి ఆదోని ఓట్లు ఒక ఊతం ఇస్తే, ఆలూరు ఓట్లు విజయానికి వారదిగా మారాయి. ఈవిధంగా శిల్పా విజయంలో ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు ప్రతినిధుల ఓట్లు కీలకంగా మారి ఆదోని డివిజన్‌లో టిడిపి పట్టును నిలబెట్టడం జరిగింది.
కార్డులిచ్చినా అందని రేషన్
ఆదోనిటౌన్, మార్చి 20: తమకు రేషన్‌కార్డులు ఇచ్చినా ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే నిత్యావసర వస్తువులు అందలేదని, అలాగే కేవలం కుటుంబంలోని ఒక్కరిద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయని బాధితులు పేర్కొంటూ సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, అయిన తమకు రేషన్‌కార్డుల్లో పేర్లు రాలేదని బాధితులు ఈరమ్మ, రంగమ్మ, గౌసియాలు వాపోయారు. రచ్చబండ కార్డులకు ప్రింటింగ్ చేసిన కార్డులు ఇవ్వలేదని మరి కొందరు వాపోయారు. తమ రేషన్‌కార్డులను తొలగించారని, ఇదేమని ప్రశ్నిస్తే ఆదాయం పెరిగిపోయిందని, ఇంటి పన్నులు అధికంగా చెల్లిస్తున్నారని, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, అందువల్ల రేషన్‌కార్డులు తొలగిపోయాయని కంపూటర్‌లో చూపిస్తోందని సిబ్బంది పేర్కొన్నారు. దీనిపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని తహశీల్దార్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
శిల్పాకు టిడిపి నాయకుల
శుభాకాంక్షలు
ఆళ్లగడ్డ, మార్చి 20: జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన శిల్పా చక్రపాణిరెడ్డిని ఆళ్లగడ్డ జడ్పీటీసీ చాంద్‌బాషా, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు సంజీవరాయుడులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించిన అనంతరం వారు ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక కావడం రెండవ సారన్నారు. శిల్పా గెలుపు కోసం కృషి చేసిన వారందరికి చాంద్‌బాషా, గూడూరు సంజీవరాయుడులు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు కోసం కృషి చేసిన వారందరికి అందుబాటులో వుండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శిల్పాను కోరారు.