జాతీయ వార్తలు

. పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రుల్లో పొగాకు నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 22: ఉత్తరప్రదేశ్‌లో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త ఉత్తర్వులనిచ్చారు. బుధవారం తొలిసారి సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి తన అధికారులతో మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్నప్పుడు పాన్ కానీ, పాన్ మసాలా కానీ నమలరాదని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి కార్యాలయాల గోడలపై పాన్ మసాలా మరకలు ఉండటాన్ని గమనించిన ఆయన సచివాలయానికి వెళ్లిన కొద్ది గంటల్లోనే అధికారులకు పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా రద్దు చేశారు. ‘ముఖ్యమంత్రి సచివాలయంలోని అన్ని అంతస్థులు తిరిగారు. అధికారులను కలిశారు. గోడలపై ఉన్న పాన్ మరకలను ఆయన గమనించారు. ఆ తరువాతే అధికారులకు విధి నిర్వహణలో ఉన్నప్పుడు పాన్ మసాలాలు వాడరాదని ఆదేశాలిచ్చారు’ అని ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ వౌర్య అన్నారు. సచివాలయంలో ఆరోగ్యకర వాతావరణంలో పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆయన కోరారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛ్భారత్ మిషన్‌కోసం ఏడాదిలో వంద గంటలు కేటాయిస్తానని, యుపిలో ప్రతి మూలనా పరిశుభ్రత ఉండేలా పాటుపడతానని యోగి అన్నారు.
కాగా, యుపిలో అక్రమ కబేళాలపై వేటు వేసేందుకు యోగి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఏర్పాటుచేసిన కబేళాలను నిస్సంకోచంగా మూసివేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలందాయి. ఈ చర్యలు అక్రమంగా ఏర్పాటు చేసిన కబేళాలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు. పర్మిట్లు లేకుండా వారణాసి, అలహాబాద్, ఆగ్రా, ఘాజియాబాద్‌లలో ఏర్పాటు చేసిన కబేళాలను ఇప్పటికే మూసివేశారు. రాష్ట్రంలో పలుచోట్ల అక్రమ కబేళాలను అనే్వషించి వాటిని మూసివేస్తున్నారు. బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లు పశువుల అక్రమ రవాణాపైనా యోగి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. దీంతోపాటు రాష్ట్రంలో అసాంఘిక శక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిత్యనాథ్ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ సెక్యూరిటీని ఓ హోదాగా భావించి పెట్టుకునే వారికి పొంచి ఉన్న ప్రమాదం, రక్షణ పరిస్థితులను పున:సమీక్షించి తద్వారా వారికిస్తున్న సెక్యూరిటీలో మార్పులు చేర్పులు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.