S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

08/09/2017 - 23:27

ధర్మము మతము రెండు విభిన్నమైన మాటలు, కానీ ఒకదానిపై మరి ఒకటి ఆధారపడి ఉన్నాయి. మహా పురుషులు వాటిని ఆచరించి ఇతరులకు అధర్మము అన్యాయము కలిగే పనులు చేయరాదని నిర్దేశించారు. ఆ మహాపురుషుల యొక్క జీవితాలు, అప్పటి సామాజిక పరిస్థితులు, కలిసి ఒక మతంగా ఏర్పడ్డాయి. దానిని ఇతరులు అనుసరించారు.

08/08/2017 - 21:17

సృష్టి ఆరంభంలో ఈ విశ్వమంతా సముద్ర జలం చేత ఆవరింపబడి వుండెనని వేదములు తేటతెల్లం చేస్తున్నాయి. ఆధునిక కాలంలో జీవశాస్తమ్రునకు సంబంధించిన సైన్సు కూడా ప్రాణులు ఏక కణ జీవుల రూపంలో నీటియందే ఉద్భవించి రానురాను రూపంలో పరిణామాన్ని ప్రారంభించినట్టు తెలుపుచున్నది.

08/06/2017 - 23:06

శ్రావణపూర్ణిమనే రాఖీ పున్నమి. పూర్వకాలంలో కొంతమంది పండితులు శ్రావణ పూర్ణిమనాడు రాజాస్థానాలకు, జమీందారుల దగ్గరకు వెళ్లి వేదాశీర్వాదాన్ని చదివి వారి దగ్గర నుంచి పారితోషకాలను పుచ్చుకునేవారు. వారిని శ్రావణీకులు అనేవారు.

08/05/2017 - 22:01

జీవితం ఎత్తు పల్లాల సంగమం. ఒక్కోసారి ఎనలేని సంతోషం వస్తే మరొకసారి భరించలేని దుఃఖం కూడా వస్తుంటుంది. సంతోషం వచ్చినపుడు, దుఃఖం కలిగినపుడు దానిని ఇతరులతో పంచుకోకుండా చాలామంది ఉండలేరు. స్థితప్రజ్ఞులైతే వారికి ఏది వచ్చినా ఒకటేగా ఉంటారు. కాని సాధారణ మనుష్యులు ఆటుపోటులకు తట్టుకోలేక నిజజీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

08/04/2017 - 23:25

‘వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే’. మన సనాతనము వ్యాస సంహితము. ప్రపంచంలోని అతి ప్రాచీన వాజ్ఞ్మయమైన వేద నిధిని అనేక రూపాల్లో మనకందించిన విష్ణురూపమే వ్యాస భగవానుడు. వాటిలో ఉపనిషత్తుల రహస్య సారమే మోక్షమునకు మార్గము. ఇంతకిమించిన అలౌకిక విజ్ఞాన భాండాగారము లేదు. సామాన్యులు మోక్షము, ముక్తి, ఆత్మజ్ఞానము మొదలైన పదములను వినడమే కానీ వాటి లోతుల లోకి పోగలిగిన జ్ఞానము, సమయము ఉండదనేది సత్యము.

08/03/2017 - 22:42

‘సరసిజ నిలయే సరోజహస్తే ధవళ తమాంశుక గంధమాల్య శోభే, భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసేద మహ్యం’’ అంటూ ఆదిశంకరులు లక్ష్మీదేవిని స్తుతించారు. మహాలక్ష్మీదేవిని దేవతలు, మానవులే కాదు త్రిమూర్తులు కూడా ఆరాధించినవారే. ధర్మసంస్థాపన చేయడంలో ప్రధాన ప్రాత వహించే శుద్ద సత్వస్వరూపిణి సముద్ర రాజ తనయ,చంద్ర సహోదరి పసిడి వర్ణంతో వెలిగే మహిమాన్విత శక్తి స్వరూపిణి ఆది పరాశక్తి రూపమే మహాలక్ష్మి.

08/02/2017 - 21:26

అవినీతి అన్నది పెద్ద సమస్య అని చాలామంది అంటుంటారు. నేను, నాది, మేము, మాది అనేవి స్వార్ధ సంకుచిత బుద్ధి అవినీతి విషబీజాలు. త్రికారాలు కాంచనం, కాంత, కీర్తి అన్నవి మనిషిని అవినీతికి దిగజారుస్తుంటాయని రామకృష్ణపరమహంస తన శిష్యులకు బోధిస్తు వుండేవారు ఒకజాతిగా మన వ్యకిత్వాన్ని కోల్పోవడమే మన దేశంలోని అనర్ధాలన్నింటికీ హేతువు కోల్పోయిన ఈ వ్యక్తిత్వాన్ని మన భారత జాతి తిరిగి పొందగలగాలి.

08/01/2017 - 21:42

సత్యం, ధర్మం, అహింస, కరుణ అనే గుణాలే మనిషిని మహాత్ముడిగా నిలబెడతాయి. తమ తమ వ్యక్తిత్వము చేత బోధనల చేత ప్రవర్తనల వలన, పరుల హితము కోరడం వలన మరింత మహిమాన్వితులుగా మారతారు. కొందరు గుహలలోనో, నిర్జనారణ్యములలోనో, నివాసాలకు దూరంగా నివశిస్తుంటారు. మరికొందరు ఈ సభ్య సమాజంలోనే సంచరిస్తూ సమాజ శ్రేయస్సుకోసం పాటుపడతారు. పాలకులోని దోషాలను, తప్పిదాలను గుర్తించి అలా నడుచుకోకూడదని హెచ్చరికలుచేస్తారు.

07/30/2017 - 21:36

ధర్మాధర్మాలు, మంచి చెడులు, చీకటి వెలుగులు ఏ యుగంలోనైనా తప్పదు. అధర్మాన్ని అణచివేసి ధర్మపరిరక్షణ చేయడం యుగధర్మం. చెడును ఖండించాలి. మంచిని ప్రోత్సహించాలి. మంచికి ప్రోత్సాహం ఎంత ముఖ్యమో చెడును అడ్డుకోవడం అంతే ముఖ్యం. ఈ విధమైన ఆలోచనా సరళిని అలవరుచుకోవడానికి జ్ఞానం అవసరం. జ్ఞాన సముపార్జనకు మార్గాలు మూడు. అవి గురువు, స్వానుభవం, సనాతన గ్రంథ పఠనం. గురువు లభ్యంకాప్పుడు ప్రామాణిక గ్రంథ పఠనం మేలు.

07/29/2017 - 22:06

సత్యవతి పుట్టుక వింతగా జరిగింది. ఆమె కురువంశంలో ప్రవేశించడమే చిత్ర విచిత్రమే. దాసరాజు కుమార్తెగా పెరిగింది సత్యవతి. ఉపరిచర మహారాజు వేటకువెళ్లి చాలా రోజులు ఆవేటలోనే ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయన భార్య గిరికను తలుచు కుంటూ ఉండేవాడు. ఆ సయమంలోనే తాను స్కలించిన రేతస్సును ఆకుగినె్నలో భద్రపరిచి తన భార్య ‘గిరిక’కు ఒక పక్షిచేత పంపించాడు. అలా పంపించేటపుడు ఒక గద్ద ఆ పక్షిని వెంబడించింది.

Pages