'క్లాప్' కొట్టు గురూ!

అవునా..నిజమా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు అందరి నోటా నటి కాజల్ అగర్వాల్ మాటే. ఎందుకంటారా? కారణం లేకపోలేదు! ప్రతి ఏటా అధిక ఆదాయం, మంచి పాపులారిటీ పొందిన వారి పట్టికను ఒక సర్వే సంస్థ విడుదల చేస్తుంది. అలా ఈ ఏడు అధిక ఆదాయం, ప్రాచుర్యం పొందిన వారిలో రజనీకాంత్, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళిలను నటి కాజల్ అగర్వాల్ అధిగమించిందట. అవునా..ఇది నిజమా? అని కాజల్‌నే కదిలిస్తే- ‘‘అవును. విజయానికి ఆదాయం, ప్రాచుర్యం కారణం అవుతాయి. నటిగా నేను ఎంతో కష్టపడ్డాను. లభించిన ప్రతీ పాత్రకూ నా శక్తివంచనలేకుండా శ్రమించి పూర్తి న్యాయం చేశాను. అందుకు ఫలితమే ఈ స్టార్ అంతస్తు. హీరోయిన్లకంటే హీరోలకు అధిక పారితోషికం ఉంటుందనేది పాత మాట. అయితే ఇప్పుడా విధానంలో ఎంతో మార్చువచ్చింది. ఆదాయం అనేది శ్రమను బట్టే ఉంటుంది’’ అంటూ సంతోషంగా సెలవిచ్చింది ఈ సుందరాంగి.

ప్చ్..నమిత!!
అంటున్నారంతా ఇప్పుడు బొద్దుగుమ్మ నమితను చూసి. టాలీవుడ్డేకాదు, అటు కోలీవుడ్‌లోనూ ఈ భామ పరిస్థితి ఇంతే! వెంకటేష్‌కు జోడీగా ‘జెమిని’ చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన ఈ తమిళకుట్టి అటు తర్వాత అగ్ర హీరో బాలయ్య నటించిన ‘సింహా’లోనూ మెరుపులు కురిపించింది. అయితే నమితకు టాలీవుడ్‌లో అనుకున్నంత పాపులారిటీ మాత్రం రాలేదు. కారణాలు ఏవైనా ఆమె గోల్‌ని మాత్రం చేరుకోలేకపోయింది. అయితే టాలీవుడ్‌లో పరిస్థితి ఇలా వుంటే తమిళనాట మాత్రం ఈ భామకు మంచి పాపులారిటీయే ఉంది. టాలీవుడ్‌లో ఎందుకు నెగ్గుకురాలేకపోయారని ఇటీవల నమితను ప్రశ్నిస్తే- ‘‘ఎందుకు నెగ్గుకురాలేదు. అగ్రహీరోల సరసన ఆడిపాడాను కదా. నాకు వచ్చిన అవకాశాల్లో నచ్చినవి చేసుకుంటూ పోయాను. నాకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపే లభించింది. ఆ గుర్తింపుతోనే కోలీవుడ్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాను. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ ప్రేక్షకులు నాపై అపూర్వ ఆదరణ కురిపించారు. చిత్రసీమ కూడా నాకు మంచి అవకాశాలనే కల్పించింది. కెరీర్ అన్నది చాలా పదునైంది. అది ఎప్పుడు ఎలా వెళుతుందో తెలియదు. ఎలా రాసిపెట్టి వుంటే అలానే జరుగుతుంది. నా వరకు నాకు నాకెరీర్ ముఖ్యం. ఇప్పుడు కోలీవుడ్‌లో నా చేతిలో చెప్పుకోతగ్గ సినిమాలే వున్నాయి. ఇవి చాలు నేను ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగడానికి’’ అంటూ కల్లబొల్లి కబుర్లు బాగానే చెప్పింది. మరి నమితను నమ్మేద్దామా?! ప్చ్..నమిత!!

వాహ్..హైదరీ!!

‘్ఢల్లీ 6’, ‘యే సాలీహై జిందగీ’, ‘రాక్‌స్టార్’ వంటి చిత్రాల్లో ఆడిపాడిన ‘వజీర్’ కథానాయిక అదితిరావుహైదరికి అప్పుడే బాలీవుడ్ అంటే మహాబోర్ కొట్టేస్తుందట. బాలీవుడ్‌లో తానో ఔట్‌సైడర్‌ననే భావన కలుగుతున్నదని సన్నిహితుల వద్ద చెప్పుకుంటుందట. ఎన్నో ఆశలతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ సుందరాంగి హిందీ చిత్రసీమలో చాలా విషయాల్లో ఇమడలేకపోతుందట. ఈ విషయం గురించి హైదరిని కదిలిస్తే- ‘‘అవును..నిజమే! నాకు అలానే అనిపిస్తుంది. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఇమేజ్ కోసం బాలీవుడ్ భామలు ఎన్నో వేషాలు వేస్తున్నారు. అవన్నీ నాకు చాతకావడం లేదు. నాకు చిత్రసీమలో గాడ్‌ఫాదర్‌లంటూ ఎవరూ లేరు. నాకు మద్దతుగా పెద్ద నిర్మాణ సంస్థగానీ, దర్శకుడుగానీ, హీరోగానీ లేరు. నేను ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అడుగులు వేస్తున్నాను. బయటి ప్రపంచం నుంచి వచ్చిన నాకు చిత్ర పరిశ్రమలో తెలిసినవారు ఎవరూ లేరు. అయినా ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే కెరీర్ ఇక అంతే! నాకు వచ్చిన అవకాశాల్లో నచ్చినవి చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్లడమే నా పని’’అంటూ చెప్పుకొచ్చింది హైదరి. వాహ్..హైదరీ!!

-సమీర్