రాష్ట్రీయం

మిగులుకు చేరుకున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్ర అవతరించిందని, వచ్చే వేసవిలో కొరత పరిస్థితి తలెత్తదని సిఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయానికి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసే స్థితికి చేరామన్నారు. శుక్రవారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం సగటున రోజుకు రాష్ట్రంలో 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. వచ్చే వేసవిలో ఒకవేళ విద్యుత్ డిమాండ్ 165 ఎంయుకు చేరుకున్నా, ఎవరికీ ఎటువంటి అంతరాయం, కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ లేని ఇండ్లు నాలుగు లక్షలున్నాయని, ఈ ఏడాది జూన్‌లోగా వాటికీ విద్యుత్ కనెక్షన్లు ఇస్తామన్నారు. సిస్టమ్ ఏవరేజ్ ఇంటరప్షన్ ఫ్రీక్వెన్సీ ఇండెక్స్, సిస్టమ్ ఏవరేజ్ ఇంటరప్షన్ డ్యురేషన్ ఇండెక్స్ పద్ధతుల ద్వారా క్రమం తప్పకుండా విద్యుత్ వ్యవస్థలను పర్యవేక్షించాలని డిస్కాంలను ఆదేశించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ విభాగాల్లో దేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. వందశాతం ఇండ్లకు విద్యుద్ధీకరణ చేయాలన్న లక్ష్యం జూన్‌నాటికి పూర్తి చేస్తామన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలను 10.39 శాతం నుంచి సింగిల్ డిజిట్‌కు తగ్గిస్తామన్నారు. వ్యవసాయానికి 10వేల సౌర విద్యుత్ పంపుసెట్ల మంజూరు చేశామన్నారు. ఇప్పటికే 6725 సౌర విద్యుత్ పంపుసెట్లను తొలిదశలో మంజూరుచేశారు. ఒక పంపుసెట్టు ఏర్పాటుకు 1.5 లక్షల సబ్సిడీని కల్పిస్తామన్నారు. 5 హెచ్‌పి పంపుసెట్టు ఏర్పాటుకు ఐదు లక్షలు ఖర్చు అవుతుందని, ఒక రైతు 11 శాతం వరకు ఖర్చు భరించాల్సి ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 93 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తామన్నారు. గత ఏడాది 62 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. వంద శాతం విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ధ్రువీకరణ పత్రాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ విషయమై ప్రతి నెల 26,27 తేదీల్లో స్థానికంగా ఉన్న విద్యుత్ సంస్థలు సమావేశాలు నిర్వహించాలన్నారు. వచ్చే నెలలోగా అన్ని ఇండ్లకు ఎల్‌ఇడి విద్యుద్ధీపాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. త్వరలో కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు 800 మెగావాట్ల ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నట్లు సిఎం చంద్రబాబు చెప్పారు.