Others

సతీ సావిత్రి (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలు: రావూరు
పాటలు: బివిఎస్ ఆచార్య, దైతా గోపాలం, రావూరు
నృత్యం: వెంపటి సత్యం
ఛాయాగ్రహణం: తంబు,
ఎడిటింగ్: ఎన్‌కె గోపాల్
సంగీతం- డి బాబూరావు, బాలమురళీకృష్ణ, వేణు, మల్లిక్
**
మహాభారతం వనపర్వంలోని గాథ ‘సతీ సావిత్రి’. నాటక ప్రదర్శనల ద్వారా బహుప్రాచుర్యం పొందిన ఈ కథ -తెలుగు పరిశ్రమ వేళ్లూనుకుంటున్న తొలి రోజుల్లోనే (1933లో) ఒకేసారి వేర్వేరు దర్శకులకు కథావస్తువు అయ్యింది.
తరువాత -1957లో దర్శకుడు కెబిఎన్ మరోసారి దీనికి దర్శకత్వం వహించారు. బందరు బాలమిత్ర నాటక సమాజంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి కడారు నాగభూషణం (కెబిఎన్). నటి కన్నాంబను పెళ్లి చేసుకుని రాజరాజేశ్వరి నిర్మాణ సంస్థ నెలకొల్పారు. తమిళం, తెలుగులో చిత్రాలు రూపొందించారు. నటి ఎస్ వరలక్ష్మి నిర్మాతగా వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రమే సతీ సావిత్రి (1957).
**
తొలిసారి -్భరత మూవీ టోన్ బ్యానర్‌పై హెచ్‌ఎం రెడ్డి దర్శకత్వంలో బొంబాయిలో దీన్ని నిర్మించారు. యముడిగా వివి సుబ్బారావు, సావిత్రిగా కాంతామణికన్య కనిపిస్తారు. ఎల్వీ ప్రసాద్, హేమసింగ్ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. అదే ఏడాది మోతీలాల్ చమ్రియా నిర్మాతగా ఈస్టిండియా ఫిలిం కంపెనీ బ్యానర్‌పై పి పుల్లయ్య దర్శకత్వంలో కలకత్తాలో మరో ‘సతీ సావిత్రి’ నిర్మించారు. ప్రముఖ రంగస్థల నటుడు వేమూరి గగ్గయ్య తొలిసారిగా నటించిన చిత్రం. సావిత్రిగా రామతిలకం, యమునిగా గగ్గయ్య, నిడుముక్కల సుబ్బారావు చిత్రంలో నటించారు. మాడోసారి శ్రీరాములు సచ్చిదానందశాస్ర్తీ రాసిన సావిత్రి నాటకం ఆధారంగా సతీ సావిత్రి నిర్మించారు.
మద్ర దేశాధిపతి అశ్వపతి (నాగయ్య). అతని భార్య మాళవి (ఋష్యేంద్రమణి). సంతానం కోసం అశ్వపతి అడవిలో చేసిన తపస్సుకు మెచ్చిన సావిత్రిదేవి వారికి సకల లక్షణ సంపన్నమైన పుత్రిక జన్మిస్తుందని వరమిస్తుంది. వర ప్రభావంతో జన్మించిన కుమార్తెకు సావిత్రి పేరు పెడతారు. సకల విద్యాపారంగతురాలిని చేస్తాడు మహారాజు అశ్వపతి. యుక్త వయస్కురాలైన సావిత్రి (ఎస్ వరలక్ష్మి) తండ్రితోపాటు అడవికి వేటకు వెళ్తుంది. అడవిలో, రాజ్యభష్టుడై, అంధుడైన ద్యుమత్సేనుని (దొరస్వామి) కుమారుడు సత్యవంతుని (అక్కినేని) కలుస్తుంది. తొలి చూపులోనే ఇరువురూ అనురాగబద్దులవుతారు. అశ్వపతి మహరాజు సావిత్రికి వివాహం చేయనిశ్చయించి రాకుమారుల చిత్రపటాలు తెప్పిస్తాడు. సావిత్రి తాను సత్యవంతునే వివాహం చేసుకుంటానని చెబుతుంది. సత్యవంతుడు అల్పాయుష్కుడని, వివాహం జరిగిన ఏడాదిలోనే ఆపద సంభవిస్తుందని నారదుని (సూరిబాబు) ద్వారా ఎతలుసుకుంటుంది. అయినా సావిత్రి అతనినే భర్తగా వరిస్తానని అంటుంది. ఆమెవల్ల తండ్రికి కీర్తి, భర్తకు సౌఖ్యం కలుగుతాయని నారదముని చెప్పటంతో అశ్వపతి, సావిత్రి సత్యవంతుల వివాహాన్ని ద్యుమత్సేనుని కోరికపై అడవిలోనే జరిపిస్తాడు. సావిత్రి రాకుమార్తెగా అల్లారుముద్దుగా పెరిగినా, భర్తననుసరించి ఆశ్రమవాసినిగా నిరాడంబరంగా జీవిస్తూ అత్తమామలను, భర్తను సేవిస్తుంటుంది. ఒక ఏడాది గడవగా నారదుడు ఆమెకు సత్యవంతుని ఆయుఃప్రమాణం ముగియనున్నదని, అందుకై సావిత్రిదేవిని ఉపాసించమని చెబుతాడు. సావిత్రి 3 రోజులు ఉపవాస దీక్షచేసి, భర్తతోపాటు అరణ్యానికి బయలుదేరుతుంది. కొంతసేపటికి సత్యవంతుడు అడవిలో సొమ్మసిల్లి పడిపోగా, యమభటులు అతని ప్రాణాలు కొనిపోయేందుకు వస్తారు. సావిత్రి అడ్డుపడటంతో అశక్తులై తిరిగిపోతారు. యమ ధర్మరాజు (ఎస్‌వి రంగారావు) స్వయంగా వచ్చి సావిత్రిని ఏమార్చి సత్యవంతుని ప్రాణాలను హరించి వెళ్తాడు. సావిత్రి యముని వెంబడించి తన మాటలచే అతన్ని మెప్పించి, ఒప్పించి తొలుత వరంగా అత్తమామలకు రాజ్యప్రాప్తి, నేత్ర దృష్టి కోరుతుంది. మరల తన తండ్రికి పుత్ర సంతానం కోరుతుంది. చివరికి తనకు పుత్ర సంతతి కోరి, దానికొరకు భర్తకు జీవదానం వరంగా గ్రహించి సంతోషంగా భర్తవద్దకు వస్తుంది. ద్యుమత్సేనుడు, సత్యవంతునికి రాజ్యాభిషేకం చేయటంతో చిత్రం ముగుస్తుంది. చిత్రంలో ఆశ్రమవాసి, గయ్యాళి భార్య మల్లికగా సూర్యకాంతం, ఆమె భర్తగా శివరామకృష్ణయ్య, పురోహితుడు రామశర్మగా అల్లురామలింగయ్య, ద్యుమత్సేనుని దాయాది ఉగ్రసేనునిగా (సీ) ఎవి సుబ్బారావు, సత్యవంతుని స్నేహితుడు శారదుడు (రేలంగి), రాకుమారి చెలికత్తె వాసంతిగా సీత, మహావిష్ణువుగా కాంతారావు, అనసూయగా సూర్యకళ నటించారు.
సత్యవంతునిగా నాగేశ్వరరావు సన్నివేశానుగుణంగా, పాత్రోచితంగా అర్ధవంతమైన నటనను ప్రదర్శించారు. సతీసావిత్రిగా యస్ వరలక్ష్మి భావయుక్తమైన నిండుదనంతో కూడిన నటనతో ఆద్యంతం మెప్పించింది. కడారు నాగభూషణం ఎంతో అర్ధవంతంగా సన్నివేశాలను రూపొందించారు. తొలుత సావిత్రికి గురువు విద్యలను నేర్పుతూ పతివ్రతల గూర్చి బోధిస్తూ అనసూయ కథను చెప్పించటం, ఆ వృత్తాంతం చిత్రీకరణ అద్భుతంగా ఉంటుంది. చిత్రకళ అభ్యాసం గూర్చి పూవు చిత్రీకరణలో చెప్పించటం, లేడి ద్వారా సత్యవంతుడు సావిత్రిల ప్రణయం, వారి వివాహం, అనురాగ దాంపత్యం, సత్యవంతునిలో సావిత్రి అడవికి వెళ్తుండగా, అడవిలో కష్టాలు పద్యాల ద్వారా సత్యవంతుడు వివరించటం, యముని వెంబడిస్తూ సావిత్రి పడేకష్టాలు, వైతరణీ నది ప్రాముఖ్యం, దాన్ని భవాని మహిమతో సావిత్రి దాటడం, చివరకు పుష్పక విమానంపై సావిత్రి భర్త వద్దకురావటం.. ఇలా ప్రతి సన్నివేశాన్నీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుకు బాలమురళీకృష్ణ ప్లేబాక్ పాడారు. ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేశారు. చిత్రంలో యమ ధర్మరాజుగా ఎస్‌వి రంగారావు తొలిసారి నటించారు. అటు నారదునితో నరకంలో నాదం, ఇటు సతీసావిత్రితో సంవాదం, చివరకు జీవదానమివ్వటం ఎంతో శాంత, గంభీర, ధీరత్వంతో ఒప్పించటం విశేషం.
అలరించిన కొన్ని గీతాలు:
సత్యవంతునిపై చిత్రీకరించిన గీతం -పోయెనయ్యో ఇపుడు ననుబాసి ఆ పొలతులమిన్నన్’ (ఎం బాలమురళీకృష్ణ). సత్యవంతుడు, సావిత్రిపై యుగళగీతం -ఓహో విలాసాల వినోదాల నావవే జాగేలనే’ (మంగళంపల్లి, ఎస్ వరలక్ష్మి). చంద్రుని చూస్తు తోటలో మరో గీతం -రావేలనో చందమామ దాగెదల చల్లగా (మంగళంపల్లి, ఎస్.వరలక్ష్మి). రేలంగి, సీతలపై -సిరిసిరి మువ్వవుగా చిన్నారి (పిఠాపురం, రాణి), ఎస్వీ రంగారావుపై పద్యం ‘్ఫ బాల పొమ్మికన్ ఈ దుర్గారణ్యమున రావలదు’ (మాధవపెద్ది, ఎస్ వరలక్ష్మీ), మరో గీతం -పోవుచున్నాడే నా విభుని ప్రాణములను గొని’ (వరలక్ష్మి), నారదునిపై భక్తిగీతం -నారాయణతే నమోనమో.. పద్యాలు -అలుక వహించినా (సూరిబాబు), సత్యవంతునిపై పద్యాలు -జలమేని గొనకుండా పాచిపట్టిన పాషాణ తలమిది, -తులసీ కనులకేగ నలత చెందెడు నీవు (మంగళంపల్లి). అర్ధవంతమైన పలు పద్యాలు, గీతాలతో ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం సతీ సావిత్రి. పద్యాలు, గీతాలు జనామోదం పొందాయి.
ఉమ్మడి కుటుంబం సాంఘిక చిత్రంలో సతీసావిత్రి వీధి నాటకం చూపటం జరిగింది. ఎన్టీఆర్ యముడిగా, వాణిశ్రీ సావిత్రిగా నటించారు. దాని ప్రేరణతో నిర్మాత శంకర్‌రెడ్డి 1978లో ‘సతీ సావిత్రి’ చిత్రాన్ని ఎన్టీఆర్ యముడిగా, వాణిశ్రీ సావిత్రిగా, కృష్ణంరాజు సత్యవంతునిగా పెట్టి సినిమా నిర్మించారు.

-సివిఆర్ మాణిక్యేశ్వరి