రాష్ట్రీయం

ఆ రాష్ట్రాల తరహాలో వంతెనల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: కర్నాటక, మహారాష్టల్ల్రో మాదిరిగా వంతెనలు చెక్ డ్యామ్‌లు కలిపి నిర్మించాలని, ఆ మేరకు రీడిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల వర్షపునీటిని నిల్వ చేసుకునే అవకాశం మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రీ డిజైన్ పూర్తయిన వంతనెల పనులు వెంటనే ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖలో జిల్లాలవారీగా జరిగిన పనులపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సమీక్ష జరిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే రహదార్లు, ప్రాంతాలను గుర్తించి అవసరాన్నిబట్టి పునర్నిర్మించాలని సూచించారు. వివిధ కారణాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి నిధులు ఖర్చుచేయలేకపోయామని అధికారులు వివరించారు. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరువేల కోట్ల రూపాయల తో ఆర్ అండ్ బి పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ల రోడ్ల పనులు 80 శాతం వరకు పూర్తవుతాయని అంచనావేశారు. రోడ్లు భవనాల శాఖకు 12వేల కోట్ల రూపాయలు కేటాయించామని, వచ్చే నాలుగు నెలల్లో పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణంలో ఉపయోగించే స్పెసిఫికేషన్, టెక్నాలజీ ఉపయోగించి నాణ్యతతో నిర్మిస్తున్నందున కొంత ఆలస్యం జరిగిందని అధికారులు వివరించారు. ఇలాంటి పలు కారణాలవల్ల 2015-16 బడ్జెట్ నిధులను పూర్తిగా ఖర్చు చేయలేకపోయినట్టు చెప్పారు. 2015 జూన్ నుంచి 2016 జూన్ వరకు రహదారులు, వంతెనలు నిర్మించడానికి అనుకూలమైన కాలం కావున 2016-17 బడ్జెట్‌లో 5500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు రూపొందించినట్టు చెప్పారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి చక్కని రోడ్లు ఏర్పాటు చేయడం వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుందని తెలిపారు. జనవరి నుంచి జూన్ వరకు నిర్మాణ పనులకు అనుకూలమైనదని, దీనిని దృష్టిలో పెట్టుకుని పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులకు అదనంగా ప్రతి రాష్ట్ర రహదారులను, 1850 కిలో మీటర్ల నిడివి గల వాటిని జాతీయ రహదారులుగా మార్పు చేయడం జరిగిందని తుమ్మల తెలిపారు. ఈ పనులకు వెంటనే డిపిఆర్‌లు పూర్తి చేసి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని మంత్రి ఆదేశించారు. ఎంతో వ్యయం చేసి నిర్మిస్తున్న రహదారులపై దమ్ము చక్రాలతో కూడిన ట్రాక్టర్ల ప్రయాణాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణ పుష్కరాలకు చేపట్టాల్సిన రహదారుల అభివృద్ధి పనులను గుర్తించి చేపట్టడానికి కావలసిన అన్ని అనుమతులను పొంది పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అదే విధంగా 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి చేయడానికి అవసరమై నిధులతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.