రాష్ట్రీయం

అదనపు డీజీలుగా రాజీవ్, ఆనంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో ఒకేసారి 36మంది సివిల్ సర్వీసెస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఐపీఎస్ అధికారుల పదోన్నతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజీవ్ రతన్, సివి ఆనంద్‌లకు అదనపు డిజీలుగా పదోన్నతి కల్పించారు. విక్రంసింగ్ మాన్, ఆర్‌బి నాయక్, బి. మల్లారెడ్డి, టి మురళీ కృష్ణ, ఎం. శివప్రసాద్‌లకు ఐజీలుగా పదోన్నతి లభించింది. రాజేశ్‌కుమార్, ఎస్ శివశంకర్‌రెడ్డిలకు డిఐజీలుగా పదోన్నతి లభించింది. ఐఏఎస్ అధికారులు డాక్టర్ ఎం జగన్మోహన్, రాహుల్ బొజ్జా, ఎ. దినకర్‌బాబులను సూపర్ టైమ్ స్కైల్‌కు పదోన్నతి కల్పించారు. పదోన్నతులు లభించిన 36మంది అఖిల భారత సివిల్ సర్వీసు అధికారుల్లో 15 మంది ఐఏఎస్‌లు, 15 మంది ఐపీఎస్ అధికారులు, ఏడుగురు ఐఎఫ్‌ఎస్ అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో డిపిసి సమావేశం శుక్రవారం జరిగింది. డివోపిటి అనుమతి మేరకు 14మంది ఐఏఎస్, 15 మంది ఐపీఎస్, ఏడుగురు ఐఎఫ్‌ఎస్ అధికారులు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో రాజీవ్ శర్మతో పాటు డిజిపి అనురాగ్ శర్మ, జిఎడి పొలిటికల్ ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా, స్పెషల్ సిఎస్ ఎంజి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. పదోన్నతులపై చర్చించారు. డివోపిటి ఇచ్చిన అనుమతి మేరకు 1982, 83, 1991, 1999, 2000, 2002, 2003 బ్యాచ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల ప్రమోషన్లకు డిపివో క్లియరెన్స్ ఇచ్చింది. 1991 బ్యాచ్ వారికి అబౌ సూపర్ స్కెల్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషనల్ డిజిలుగా ప్రమోషన్లు ఇచ్చారు. 1999 సూపర్ స్కేల్‌లో సెక్రటరీలు, ఐజీలుగా ప్రమోషన్లు లభించాయి. 2003 బ్యాచ్ అధికారులకు సెలక్షన్ గ్రేడ్ స్కేల్ ప్రమోషన్లు లభించనున్నాయి. 1991 బ్యాచ్ అబౌ సూపర్ స్కేల్‌లో 5గురు, 99 బ్యాచ్ సూపర్ స్కేల్ 3, 2000 బ్యాచ్ సూపర్ స్కేల్ 2, 2003 బ్యాచ్ 4గురు ఉన్నారు. పదోన్నతుల్లో ఇండియన్ పోలీసు సర్వీసుకు సంబంధించి 1983 బ్యాచ్ డిజి1, 1984 బ్యాచ్ డిజి1, 1991 బ్యాచ్ అబౌ సూపర్ స్కేల్ 2, 1998 బ్యాచ్ ఐజి 6, 2002 బ్యాచ్ డిఐజి 6, 2003 బ్యాచ్ సెలక్షన్ గ్రేడ్‌లో ముగ్గురు అధికారులు ఉన్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 1982 బ్యాచ్ పిసిసిఎఫ్ 5, 1983 బ్యాచ్ పిసిసిఎఫ్ లో ఇద్దరు ఉన్నారు.