రాష్ట్రీయం

అమిత్‌షా సభకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే బహిరంగ సభకు లక్ష మందికిపైగా హాజరయ్యే విధంగా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్బులో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 6న జరగనున్న బహిరంగ సభకు హాజరుకావాలని అధిక సంఖ్యలో బిజెపి కార్యకర్తలు, అభిమానులు సమాయత్తమవుతున్నారన్నారు. బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు ఎం వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్ తదితరులు రానున్నారని చెప్పారు.
కేంద్రప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తున్నప్పటికీ, వాటికి సరయిన ప్రాచుర్యం లభించటం లేదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా కేంద్రప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. రాజమహేంద్రవరంలో జరిగే సభలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం చేస్తున్న కృషి, సంక్షేమ పథకాలు తదితర అన్ని వివరాలను ప్రజలకు వివరిస్తారన్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే అనేక కార్యక్రమాలను పొందుపరిచిందన్నారు.
గతంలో ఎప్పుడూ లేనంత కేటాయింపులు ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. కాపు కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తుచేసుకున్న వారికి సబ్సిడీ మంజూరయ్యేలా కృషిచేస్తామన్నారు.
కొన్ని చోట్ల జన్మభూమి కమిటీల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోందని, ఇలాంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ల పరిష్కరిస్తామన్నారు.
అందరికీ ఇళ్ల పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అర్హులైన వారికి ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. బొమ్మూరు, తొర్రేడు తదితర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించిన భూమి నిర్మాణానికి అనువుగా లేదని ఎమ్మెల్యే ఆకుల చెప్పారు.