రాష్ట్రీయం

ఆంధ్రకు ఇండోరమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ప్రపంచస్థాయి నగరలతో సమానంగా ఉన్నతస్థాయి ప్రమాణాలతో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి బృహత్ ప్రణాళిక ఖరారు చేసామని, మహాయజ్ఞంలో అన్ని రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణం, ఆధునాతన పరిశ్రమల ఏర్పాటు, లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతున్న దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అనేకమంది పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు. దావోస్‌లో శనివారం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. భారత పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, మెకెన్సీ గ్లోబల్ సిఇవో డొమినిక్ బార్టన్‌ను కలుసుకున్నారు. అమరావతికి పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ఉత్తమ ప్రాక్టీసెస్, సుపరిపాలన విధానాలను అందచేస్తామని డొమినిక్ బార్టన్ హామీ ఇచ్చారు.
500 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఇండోరమ
పెట్రో కెమికల్ ఉత్పత్తులు, సింథటిక్ ప్లాస్టిక్ సీసాలు, సర్జికల్ గ్లోవ్స్ తయారీలో ప్రసిద్ధి చెందిన ఇండోరమ సింథటిక్ కంపెనీ ఆంధ్రలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కంపెనీ సిఇవో ప్రకాశ్ లోహియా చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు సానుకూల పరిస్థితులపై అధ్యయనానికి మార్చిలో ఒక బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య డిజి చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు. వైద్య ఆరోగ్య పరికరాల ఉత్పత్తిలో పేరున్న మెడ్ ట్రానిక్ కంపెనీ సిఇవో మైఖేల్ కోయిల్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. గుండె జబ్బులకు సంబంధించిన పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసే విషయమై పరిశీలిస్తామని మైఖేల్ హామీ ఇచ్చారు. రష్యాలో ఆర్బన్ వౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ టెక్నాలజీ, ఫార్మా సన్‌గ్రూప్ చైర్మన్ శివఖేమ్కాతో సమావేశమయ్యారు. ఫోర్టిస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మల్విందర్ సింగ్ చంద్రబాబును కలిశారు. రాష్ట్రాన్ని వైద్యరంగంలో హబ్‌గా మార్చాలన్నదే తన ఆశయమని చంద్రబాబు తెలిపారు.
ఫైబర్ అఫ్టికల్ ప్రాజెక్టుకు సిస్కో సహకారం
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ 15నుంచి 20 ఎంబిపిఎస్ ఫైబర్ ఆప్టికల్ కనెక్షన్ ఇవ్వాలని తలపెట్టిన పథకానికి సహకరించేందుకు సిస్కో కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. కంపెనీ చైర్మన్ జాన్ చాంబర్స్ తమ సహకారం అందిస్తామన్నారు. ఉభయ పక్షాలనుంచి ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. సేల్స్‌ఫోర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ వివేక్ కుంద్రా మాట్లాడుతూ కస్టమర్ల ఆదరణ చూరగొనేందుకు తమ కంపెనీ అనుసరిస్తున్న విధానాలను తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సహకరించాలని జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజన్సీని కోరారు. ఈ సంస్థ అధ్యక్షుడు షిన్ని కిటావొకా మాట్లాడుతూ జపాన్‌కు అమరావతి ఒక ఆకర్షణని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశాల్లో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు.