తెలంగాణ

అవి పెయిడ్ ఆర్టికల్సే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: టిఆర్‌ఎస్ వార్తలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలని ఆయన శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురిస్తున్న, టీ-న్యూస్‌లో ప్రసారం చేస్తున్న వార్తలను, ఆర్టికల్స్‌ను, కథనాలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలని కోరినట్లు ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఎన్నికల నియమ, నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు మెట్రో రైలు పనుల విస్తరణ చేపడతామని, దుర్గం చెరువు మీద 4 లైన్లతో బ్రిడ్జి నిర్మిస్తామని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లు పిలుస్తామని వార్తలు ప్రచురితమయ్యాయని ఆయన చెప్పారు. ఈ అంశాలు ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపిస్తాయని అన్నారు. గతంలో హైదరాబాద్ ఓటర్లను తొలగించినప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించలేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్నదా? లేదా? అనే అనుమానం కలుగుతున్నదని అన్నారు. అందుకే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.