రాష్ట్రీయం

అట్టహాసంగా ‘్ఫ్లట్ రివ్యూ’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖటప్నం, ఫిబ్రవరి 5: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)ను రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. విశాఖలో ఐఎన్‌ఎస్ శాతవాహనలోని కమాండ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఫ్లీట్ రివ్యూ విజయవంతం కావాలని, భారత నౌకాదళ ప్రతిభ దశ దిశలా వ్యాపించాలని ఆకాంక్షించారు. భారత నౌకాదళ ప్రధాన అధికారి ధావన్ తన ప్రసంగంలో వివిధ దేశాల నౌకాదళాల నుంచి వచ్చిన ప్రతినిధులకు స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ దేశాల నౌకాదళాలకు చెందిన ప్రధాన అధికారులు, నౌకాదళ సిబ్బంది కూడా ఈ వేడుకలను తిలకించారు. ఐఎఫ్‌ఆర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లు వ్యవహరిస్తున్నా అక్షయుకుమార్, కంగనా రనౌత్ ప్రారంభోత్సవ వేడుకల్లో సందడి చేశారు. ఆంధ్ర రాష్ట్ర సంప్రదాయ నృత్యమైన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసా ప్రదర్శన అందరి ప్రశంసలు అందుకుంది. అలాగే షిమక్ థావర్ బృందం ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఆఖరుగా శ్రీలంక నేవీ బ్యాండ్, డ్యాన్స్ నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.