ఆంధ్రప్రదేశ్‌

ఏసిబి కేసులో అరెస్టయిన ఆదిశేషుపై ఎక్సైజ్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 22: ఆదాయానికి మించి అక్రమాస్తుల ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖాధికారులు అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మామిళ్లపల్లి ఆదిశేషుపై తాజాగా ఎక్సైజ్ కేసు నమోదైంది. విజయవాడలో నివాసముంటున్న ఆదిశేషు పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులోని ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై హైదరాబాద్ ఏసిబి సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ యూనిట్ గత రెండు రోజులుగా గుంటూరు, విజయవాడ, చాగల్లులోని ఆదిశేషు ఇళ్ళు, ఆస్తులపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడలోని ఐఎన్‌జి వైశ్యాబ్యాంకు, ధనలక్ష్మీ బ్యాంకు లాకర్లు తెరచి బినామీ పేర్లతో ఉన్న వజ్రాలు, బంగారు, వెండి నిల్వలు గుర్తించారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం నాలుగు కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. విజయవాడలోని ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో 14 స్కాచ్ మద్యం సీసాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి ఆదిశేషు ఆరు మద్యం సీసాలు కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. కాని అంతకుమించి ఎక్కువ ఉన్నందున సీసాలను సీజ్ చేసిన ఏసిబి అధికారుల సిఫార్సు మేరకు అతనిపై ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్టేషన్‌లో ఎక్సైజ్ కేసు నమోదైంది. దీంతో ఇప్పటికే ఏసిబి కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో రిమాండులో ఉన్న ఆదిశేషును కొద్దిరోజుల్లో ఎక్సైజ్ పోలీసులు పిటి వారెంట్‌పై అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు సమాచారం. కాగా ఈరెండు కేసుల్లో అరెస్టయిన ఆదిశేషును ప్రభుత్వం సస్పెండ్ చేయనుంది.