ఆంధ్రప్రదేశ్‌

కరోనా కట్టడిలో గోదావరి జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13: కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా గత మూడు వారాలుగా గోదావరి జిల్లాలు కర్ఫ్యూ వాతావరణంలో కాలం వెళ్లబుచ్చుతున్నాయి. ఉదయం 11 గంటల వరకూ నిత్యావసరాల కోసం వస్తున్న వారితో కాస్త జన సంచారం కనిపిస్తున్నప్పటికీ, ఆ తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కోవిడ్-19 సేవల్లో పాల్గొంటున్న అత్యవసర సేవల సిబ్బంది వాహనాలు, నిత్యావసరాలు రవాణాచేస్తున్న వాహనాలు మినహా రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భౌగోళికంగా గోదావరి నదికి అటూ ఇటూ ఉండే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రవాణా సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరు జిల్లాలను కలిపే రోడ్డుకం రైలు బ్రిడ్జిని కంచె వేసి పూర్తిగా మూసివేసి పోలీసులు పహారా కాస్తున్నారు. ఏలూరు రేంజి డీఐజీ కెవి మోహన్‌రావు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాం నరుూం అస్మీ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్ నిత్యం రోడ్లపై తిరుగుతూ లాక్‌డౌన్ అమలుతీరును పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారికి కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే వారి వాహనాల స్వాధీనానికి ఆదేశాలు జారీచేస్తున్నారు. గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం కరోనా ప్రభావానికి దూరంగా వుంది. కరోనా వైరస్ సోకిన వారికి ఐసొలేషన్ వార్డుల్లో చికిత్సనందిస్తున్నారు. రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో శంఖవరం, కొత్తపేట మండలాలను రెడ్ జోన్లుగా గుర్తించారు. అడ్డతీగల, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, రాజమహేంద్రవరం అర్బన్ మండలాలను ఆరంజ్ జోన్లుగా గుర్తించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, పెనుగొండ భీమవరం, ఆకివీడు, ఉండి తదితర ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. కరోనా వైరస్ తెచ్చిన స్వీయక్రమ శిక్షణతో దైనందిన జీవితాన్ని మల్చుకుని లాక్‌డౌన్‌కు జనం అలవాటు పడిన వాతావరణం కన్పిస్తోంది. మంగళవారంతో లాక్‌డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన కోసం ఇరు జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
*చిత్రాలు.. నిర్మానుష్యంగా కనిపిస్తున్న రోడ్-కమ్-రైలు వంతెన
* రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటిస్తున్న ఏలూరు రేంజి డీఐజీ మోహన్‌రావు