రాష్ట్రీయం

ఆదిత్యునిపై సప్తగిరీశుడి విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఫిబ్రవరి 14: సప్తగిరీశుడైన శ్రీ వేంకటేశ్వరుడి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి తిరుమలలోని చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. 15 గంటల్లో స్వామివారు 7 వాహనాలపై విహరించారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఈ వేడుకలు వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై సాగి చివరిగా చంద్రప్రభ వాహనంతో ముగిశాయి. సూర్యజయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది మాఘశుద్ధ సప్తమినాడు టిటిడి తిరుమలలో నిర్వహించే రథసప్తమి వేడుకలు ఆద్యంతం కన్నుల పండువగా సాగాయి. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు రెండు లక్షల మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రథసప్తమి వేడుకల్లో తొలి వాహనంగా ఆదివారం సూర్యప్రభ వాహనంపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అటు తర్వాత స్వామివారు ఉదయం 9 గంటలకు చిన్నశేషవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. 11 గంటలకు శ్రీవారి వాహన సేవల్లోనే అత్యంత విశిష్టమైనది, ప్రధానమైన గరుడ వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారు ఛత్ర, చామర, మంగళవాయిద్యాల నడుమ సార్వభౌమిక రాచ మర్యాదలతో గరుత్మంతుడిపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. మధ్యా హ్నం ఒంటి గంటకు స్వామివారు హ నుమంత వాహనంపై విహరించారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీమలయ ప్ప స్వామివారు నేరుగా వరాహస్వామివారి అలయానికి చేరుకున్న త ర్వాత చక్రత్తాళ్వార్ వారికి పసుపు, చందనం, సుగంధ పరిమళ ద్రవ్యాలతో పంచామృత స్నానం చేయించారు. అనంతరం పుష్కరిణిలో జరిగిన చక్రస్నాన మహోత్సవంలో వేలా ది భక్తులు పుణ్యస్నానాలు అచరించి పునీతులయ్యారు. సాయంత్రం స్వా మివారు సకల కోరికలను తీర్చే కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం నుండి ఏకాంతంగా వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు సాయం త్రం ఉభయదేవేరులతో కలసి తిరుమాడ వీధుల్లో విహరించారు. సా యంత్రం 6 గంటలకు స్వామివారు సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. రాత్రి 8 గంటలకు స్వామివారు వెన్నదొంగ చిన్ని కృష్ణుడిగా చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.