రాష్ట్రీయం

అనంతపురంలో ఇంధన వర్సిటీ ఏర్పాటుకు సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురంలో ఇంధన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తక్షణమే అన్ని చర్యలు తీసుకుంటామని ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ (టెరి) కొత్త డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన అజయ్ మాథుర్ అన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్ జైన్‌తో మాట్లాడారు. రాష్ట్రంలో ఇంధన రంగంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడం, ప్రయోజనాలపై విశేషమైన పరిశోధనలు చేయాలని, దీనికి అవసరమైన అనుమతులు ఇస్తామని అజయ్ మాథుర్ హామీ ఇచ్చారు. టెరి సంస్థ వాష్టింగ్టన్, లండన్, జపాన్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో విదేశీ సంస్ధల సహకారంతో ఇంధన రంగం అభివృద్ధిపై పరిశోధనలు చేస్తోంది.
అజయ్ మాథుర్‌ను కలిసి అజయ్ జైన్ రాష్ట్ర ఇంధన రంగంలో చేపట్టిన సంస్కరణలు, ప్రణాళికను వివరించారు. రాష్టమ్రంతా అన్ని మున్సిపాలిటీలు, గృహ రంగంలో ఎల్‌ఇడి బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేశామన్నారు. ఇంధన సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను తెలియచేశామన్నారు.
రాష్ట్రంలో గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇంధన పొదుపు చర్యల వల్ల ఇంతవరకు 400 కోట్ల ఎంయు విద్యుత్‌ను ఆదా చేశామన్నారు. అమరావతిలో క్లీన్ అండ్ గ్రీన్ ఇంధన సంరక్షణ కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.