నమ్మండి! ఇది నిజం!!

అసత్యమేవ జయతే! ( నమ్మండి.. ఇదినిజం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబద్ధం చెప్పేవారిని ఎవరూ ఇష్టపడరు. అబద్ధం ఆడటం పాపం అని ప్రతీ మతం చెప్తుంది. అంతేకాక సమాజం, ఆఖరికి ప్రతీ మనిషి కూడా అబద్ధం చెప్పడం తప్పని ఒప్పుకుంటాడు. కానీ అబద్ధాలని ప్రోత్సహించే ఓ ప్రదేశం ఉందని మీకు తెలుసా?
ఇంగ్లండ్‌లోని శాంటన్ బ్రిడ్జ్ అనే చిన్న గ్రామంలోని గ్రామస్థులకి అబద్ధాలు అంటే ఇష్టం. ఎంతగా అంటే ఏటా అక్కడ అబద్ధాల పోటీలని నిర్వహించి, ‘వరల్డ్స్ బిగ్గెస్ట్ లయర్’ (ప్రపంచంలోని అతి గొప్ప అబద్ధాలకోరు) అనే బిరుదుని ఇస్తారు.
‘ది వరల్డ్స్ బిగ్గెస్ట్ లయర్’ పోటీ ఏటా నవంబర్ నెలలో 19వ తారీఖున జరుపుతూంటారు. దీన్ని అక్కడి 19వ శతాబ్దపు ‘బ్రిడ్జ్ ఇన్’ అనే హోటల్ పూర్వ యజమాని విల్ రిట్సన్ అనే వ్యక్తి గౌరవార్థం నిర్వహిస్తున్నాడు. కారణం, అప్పట్లో విల్ రిట్సన్ గ్రామస్థులకి నమ్మలేని కథనాలని చెప్పి అవన్నీ పచ్చి నిజాలని చెప్పేవాడు. ఉదాహరణకి అతను వస్‌డేల్ అనే చోట చూసిన టర్నిప్స్ పూలు ఎంత పెద్దవంటే, స్థానికులు ఆదివారం లంచ్ సమయంలో వాటి కింద గొడుగు కింద కూర్చున్నట్లు కూర్చుంటారని, వాటి కింద గొర్రెలకి షెడ్లని నిర్మిస్తారని చెప్పాడు. (ఇవి చాలా చిన్న పూలు)
1808లో జన్మించిన విల్ రిట్సన్ 1890లో మరణించే నాటికి తన హోటల్‌కి వచ్చి తాగే వాళ్లకి ఇలాంటి కొన్ని వేల అబద్ధాలని చెప్పి వినోదపరిచేవాడు. ఇంగ్లండ్‌లోని అత్యంత అందమైన ప్రాంతం లేక్ డిస్ట్రిక్ట్. ఇంగ్లండ్‌లోని అత్యంత లోతైన సరస్సు వాస్ట్ వాటర్ సరస్సు. అత్యంత ఎతె్తైన పర్వతం స్కఫెల్ పైక్. అత్యంత చిన్న చర్చ్ వస్‌డేట్ హెడ్ చర్చ్. ఐదో వింత ఇంగ్లండ్‌లోని అత్యంత అబద్ధాలకోరు విల్ రాట్సన్ అని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. ఐతే అతను ఎన్నడూ అవి అబద్ధాలని ఒప్పుకోలేదు. అవన్నీ నిజం అని నమ్మకంగా చెప్పేవాడు.
ఈ పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నించి వస్తూంటారు. సందర్శకులు తొమ్మిది పౌండ్లతో టిక్కెట్‌ని కొనుక్కుని చూడాలి. లంచ్ ఉచితం. ఈ పోటీ విల్ రిట్సన్ స్థాపించిన బ్రిడ్జ్ ఇన్ హోటల్లోనే జరుగుతుంది.
ప్రపంచంలో రెండు వృత్తుల వారు అబద్ధాలు ఆడతారని ప్రతీతి. ఆ రెండు వృత్తుల వారు మాత్రం ఈ పోటీలో పాల్గొనడానికి అనర్హులు. వాళ్లు లాయర్స్, రాజకీయ నాయకులు! కారణం, వారు నిత్య జీవితంలో అబద్ధాలు చెప్తూండటమే.
‘అనేక మంది అందరూ నమ్మే రకరకాల అబద్ధాలని చెప్పినా వారిలోంచి ఒకర్నే ఎన్నుకోగలగడం దురదృష్టం. ఇందులో పాల్గొనే అందరూ దాదాపు ప్రపంచంలోని గొప్ప అబద్ధాల కోరులే’ అని ఓ సందర్శకురాలు 2003లో చెప్పింది.
‘ఒక్కో పోటీ దారుకి అబద్ధం చెప్పడానికి ఐదు నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు. వినడానికి నిజంలా అనిపించినా అది అబద్ధమై ఉండాలి అన్నది గెలుపునకు ప్రధాన నియమం. ప్రేక్షకులు, జడ్జ్‌ల ముందు వారు మైక్‌లో అబద్ధాలు చెప్పాలి.
ఇటీవల జర్నలిస్ట్‌లు, సేల్స్‌మెన్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లని కూడా ఇందులో పాల్గొనకుండా నిషేధించారు. కారణం వాళ్లు కూడా వృత్తిరీత్యా అబద్ధాలు ఆడటానికి అలవాటు పడ్డవారే అవడం అని వివరణ ఇచ్చారు. 2003లో సౌత్ ఆఫ్రికాకి చెందిన అబ్రీ క్రూగర్ అనే అతనికి ఈ బిరుదు లభించింది. వస్‌డేల్ వేలీకి తనని రాజుగా చేసిన విశేషాల్ని అతను చెప్పాడు. విదేశస్థుడు ఈ బిరుదుని గెలుచుకోవడం అదే మొదటిసారి. మరో ఏడాది ఓ బిషప్ ‘నా జీవితంలో నేనెన్నడూ అబద్ధం ఆడలేదు’ అని ఏక వాక్యం చెప్పి ఆ బిరుదుని గెలుచుకున్నాడు. ఇది గెలుపొందిన వ్యక్తి చెప్పిన అతి చిన్న అబద్ధం.
2006లో స్యూ పెర్కిన్స్ అనే కమెడియన్ ఈ బిరుదుని గెలుచుకుంది. ఈ పోటీలో ఓ మహిళ గెలుపొందడం ఇదే మొదటిసారి. ఆమె చెప్పిన అబద్ధం - ఓజోన్ పొర వల్ల పర్వత శిఖరాల మీది మంచు కరగడంతో మనుషులు ఒంటెల మీద ఆఫీస్‌కి వెళ్లాల్సి వస్తోంది’ అని. ఎక్కువసార్లు ఈ పోటీలో గెలుపొందిన వ్యక్తి జాన్ గ్రాహం. 2008లో ఏడవసారి ఇతను ‘రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన జర్మన్ సబ్ మెరైన్ బ్రిటన్ మీద దాడి చేసి, డిజిటల్ డీ కోడర్స్‌ని పట్టుకెళ్ళింది’ అన్న అబద్ధం చెప్పి గెలిచాడు. 2010లో గ్లెన్ బాయ్‌లాన్, ‘ప్రిన్స్ ఛార్లెస్ నత్తల రేస్‌లో వాటి పెంకులని తొలగిస్తే, అవి ఇంకా వేగంగా వెళ్తాయని చెప్పాడనే’ అబద్ధంతో గెలుపొందాడు. 2013లో మైక్ నైలర్ (57) మూడోసారి గెలుపొందాడు. ‘వాస్ట్ వాటర్’ అనే స్థానిక సరస్సులో ఓ రాక్షస జీవి నివసిస్తోందని నమ్మకంగా చెప్పాడతను.
జార్జ్ కెంప్ అనే వ్యక్తి జర్మనీ నించి ఇంగ్లండ్‌కి చెక్క కారులో వచ్చానని చెప్పి 2014లో గెలిచాడు. ఐతే పోటీదారులు చేతిలో స్క్రిప్ట్ కానీ, పరికరాలు కానీ ఉంచుకోకూడనే నియమం ఉంది. అబద్ధం ఆడితే ముక్కు పెరుగుతుందని పాశ్చాత్యుల జానపద కథలో ఉంది. కాబట్టి పెరిగిన ముక్కు ఈ పోటీ సింబల్‌గా తీసుకున్నారు. యూ ట్యూబ్‌లో వాళ్లు చెప్పిన ఈ అబద్ధాలని చూడచ్చు, వినచ్చు.

పద్మజ