నమ్మండి! ఇది నిజం!!

అంతరిక్షంలో ప్రాణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు పెట్టిన తొలి మానవుడు. ఇది సాధించే ముందు అక్కడికి వెళ్తే జరిగే పరిణామాలని అంచనా వేయడానికి అటు రష్యన్స్, ఇటు అమెరికన్స్ అనేక జంతువులని అంతరిక్షంలోకి పంపారు. అంతరిక్షంలోకి జంతువులని పంపిన మొదటి దేశం రష్యా.
1947లో అమెరికా నాజీల నించి స్వాధీనం చేసుకున్న వి-2 రాకెట్‌లో పండ్లలోని పురుగులని ఉంచి అంతరిక్షంలోకి పంపింది. జీవుల మీద కాస్మిక కిరణాల ప్రభావం తెలుసుకోవాలని ఈ ప్రయోగం చేశారు. రాకెట్ తిరిగి వచ్చాక పేరాచ్యూట్ ద్వారా ఆ పురుగులున్న లోహపు పెట్టె భూమి మీదకి దిగాక పురుగులు ఇంకా బతికే ఉండటం చూసి శాస్తజ్ఞ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
తర్వాతి మెట్టుగా 1948లో ఆల్బర్ట్-1 అనే కోతిని అమెరికన్స్ అంతరిక్షంలోకి పంపారు. వి-2 బ్లాసమ్ అనే పేరు గల ఆ రాకెట్‌లోకి ఆ కోతిని ఎక్కించే ముందు దానికి మత్తుని ఇచ్చారు. రాకెట్ అంతరిక్షంలోకి విజయవంతంగా వెళ్లాక శాస్తజ్ఞ్రులు అది జీవించి ఉండకపోవచ్చునని భావించారు. టేకాఫ్‌కి మునుపే ఇరుకుగా ఉన్న కేప్సూల్‌లో దానికి ఊపిరి ఆడక, మరణించి ఉంటుందని అనుకున్నారు. కాని అది అంతరిక్షంలో కార్మన్ లైన్ దాటి (్థయోడర్ వాన్ కర్మన్ అనే హంగేరియన్ - అమెరికన్ ఫిజిస్ట్ సముద్ర మట్టానికి 62 కిలోమీటర్ల పైన భూవాతావరణం సమాప్తమై అంతరిక్షం ఆరంభం అవుతుందని ప్రతిపాదించాడు. దానికి కార్మన్ లైన్ అని పేరు) తిరిగి వస్తూండగా పేరాచ్యూట్ ఫెయిల్ అవడంతో కూలిపోయింది. ఆల్బర్ట్ పేరు మాత్రం అమెరికన్ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత కోతులని అంతరిక్షంలోకి పంపే ప్రాజెక్ట్‌కి ‘ఆల్బర్ట్ ప్రాజెక్ట్’ అనే పేరే పెట్టారు. ఆల్బర్ట్-2కి రాకెట్ కేప్సూల్‌లో ఎక్కువ స్థలం కేటాయించడంతో దానికి ఏం కాదని భావించారు. అది 83 మైళ్లు అంతరిక్షంలోకి వెళ్లాక ఈసారి కూడా పేరాచ్యూట్ ఫెయిల్ అవడంతో ఆల్బర్ట్-2 పేరుగల కోతి కూడా మరణించింది. ఇలాగే ఆల్బర్ట్ -3,4,5 లు కూడా రాకెట్ గాల్లో పేలిపోవడం వల్లనో, ప్రయాణంలోని ఇబ్బందుల వల్లనో ఏవీ ప్రాణాలతో తిరిగి రాలేదు. 1959 దాకా అమెరికా అంతరిక్షంలోకి పంపిన ఒక్క జంతువు కూడా భూమి మీదకి తిరిగి ప్రాణాలతో చేరలేదు.
ఈలోగా రష్యన్స్ కూడా రహస్యంగా అంతరిక్షంలోకి కుందేళ్లు, ఎలుకలని పంపారు. తర్వాత కుక్కలని పంపసాగారు. కారణం అవి శిక్షణకి స్పందిస్తాయి. కమ్యూనికేట్ చేస్తాయి. ఆ రోజుల్లో మాస్కో రోడ్ల నిండా చాలా ఊరకుక్కలు ఉండేవి. జూలై 1951లో డెజిక్, సైజెన్ అనే రెండు కుక్కలని వారు అంతరిక్షంలోకి పంపారు. వంద కిలోమీటర్లు వెళ్లాక ఆ రాకెట్ నించి వెలువడ్డ ఈ రెండు కుక్కలు ఉన్న కేప్సూల్స్ భూమిని వేగంగా తాకడంతో అవి మరణించి ఉంటాయని భయపడ్డారు. కాని వారు కేప్సూల్ మూతని తెరిస్తే అవి మొరుగుతూ పలకరించడంతో శాస్తజ్ఞ్రులు సంతోషపడ్డారు. పురుగులని మినహాయిస్తే అంతరిక్షంలోకి వెళ్లి ప్రాణాలతో తిరిగి వచ్చిన మొదటి జీవులు డెజిక్, సైజెన్‌లే.
తర్వాత సోవియట్స్ అంతరిక్షంలోకి చాలా కుక్కలని పంపారు. చాలావరకు అవి ప్రాణాలతో తిరిగి వచ్చాయి. 1957లో లైకా అనే కుక్కపిల్ల ప్రఖ్యాతి చెందడానికి కారణం అది రాకెట్‌లో భూమి చుట్టూ అంతరిక్షంలో తిరుగుతూండటం. ఆ రాకెట్‌లో లైకా ఎనిమిది గంటలు మాత్రమే జీవించి ఉంది. ఆ రాకెట్ వెనక్కి తిరిగి రాలేదు. లైకా ప్రాజెక్ట్‌లోని శాస్తజ్ఞ్రుల్లో ఒకరైన ఒలెక్ గజెంకో ఇలా చెప్పాడు.
‘జంతువులతో పని చేయడం మాకు ఎంతో బాధాకరం. ఓ కుక్క మరణించడం మాకు న్యాయంగా తోచేది కాదు’
రష్యన్స్ కుక్కల్ని ఎన్నుకున్నట్లే అమెరికన్స్ కోతులని ఎన్నుకున్నారు. 1959లో నాసా రెండు కోతుల్ని అంతరిక్షంలోకి పంపడానికి ఎన్నుకుంది. మొదటి ఆడ కోతి పేరు ఏబుల్. కేన్సాస్‌లోని ఇండిపెండెన్స్ అనే ఊరికి చెందిన జూ నించి వచ్చిన 24 కోతుల్లోంచి ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ ఏబుల్‌ని ఎంపిక చేశాడు. కారణం దాని పూర్వీకులు పుట్టింది ఇండియాలో. ఇండియాలో ఈ రకం కోతిని పవిత్రంగా భావిస్తారు. కాబట్టి రాజకీయ కారణంగా ఆ తరహా కోతిని అంతరిక్షంలోకి పంపడం మంచిదని భావించారు.
రెండో కోతి మయామిలోని పెంపుడు జంతువుల దుకాణంలోంచి కొన్న 25 కోతుల్లోని ఒకటి. సౌత్ అమెరికాలో పుట్టిన ఈ కోతి పేరు మిస్ బేకర్. ఆనాటికి రెండేళ్ల వయసు గల దీని బరువు సుమారు అర కిలో. దాని తెలివితేటలు, శాంత స్వభావం, స్నేహశీలత వల్ల దాన్ని ఎన్నుకున్నారు. దానికి టిఎల్‌సి (టెండర్ లవింగ్ కేర్) అనే నిక్‌నేమ్‌ని కూడా శాస్తజ్ఞ్రులు పెట్టారు. ఈ రెంటినీ శిక్షణకి పంపారు. ప్రతీ కోతికి ప్రత్యేకంగా నాడి, శరీర ఉష్ణోగ్రత, కదలికలు తెలుసుకునే సెన్సర్ అమర్చిన సూట్లని తొడిగారు.
ఏబుల్ సూట్‌ని తక్కువ కదలికలు ఉండేలా బిగుతుగా తయారుచేశారు. ఎర్ర లైట్ వెలిగినప్పుడల్లా ఓ బటన్‌ని నొక్కే శిక్షణని దానికి ఇచ్చారు. రెండు కోతులకి ఫైబర్ గ్లాస్ హెల్మెట్స్‌ని అమర్చారు.
28, మే 1959న తెల్లవారుఝామున 2.35కి జూపిటర్ ఏఎం 18 అనే రాకెట్లో ఈ కోతులని పంపారు. పదిహేడు నిమిషాల తర్వాత ప్యూర్టోరికోలోని సేన్ జువాన్‌కి ఆగ్నేయ దిశలో 250 మైళ్ల దూరంలోని సముద్రంలో అది కూలిపోయింది. దాన్ని స్వాధీనం చేసుకునే టీం వెంటనే సముద్రంలో తేలే ఆ కోతులు ఉన్న కేప్సూల్‌ని కనుక్కున్నారు. ఏబుల్, బేకర్ ఎలాంటి గాయాలు లేకుండా చక్కగా ఉన్నాయి. అమెరికా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి ప్రాణాలతో భూమికి చేరిన తొలి జీవులు ఈ రెండు.
అక్కడ నించి మొదట వాటిని వాషింగ్టన్ డిసిలోని ప్రెస్ కాన్ఫరెన్స్‌కి విమానంలో తరలించారు. పత్రికా విలేకరులు ఒకర్ని మరొకరు తోసుకొని కుర్చీల మీదకి కూడా ఎక్కి వాటిని ఫొటోలు తీసుకున్నారు. ఐతే జరిగేది పట్టించుకోకుండా అవి వేరుశెనగ పప్పు, బిస్కెట్లు తింటూ ప్రశాంతంగా ఉంటే, చుట్టుపక్కల మనుషులంతా ఉద్వేగంగా ఉన్నారు. వాటికి అనేక పతకాలు కూడా బహూకరించారు.
నెల తర్వాత లైఫ్ మేగజైన్ వాటి ఫొటోని కవర్ పేజీ మీద ముద్రించింది. ఐతే ఏబుల్ ఖ్యాతి ఆట్టే కాలం మనలేదు. ఆ ప్రయాణం తర్వాత 1, జూన్ 1959న దాని శరీరంలోని ఎలక్ట్రోడ్స్‌ని తీయడానికి ఎనస్థీషియా ఇస్తే ఆపరేషన్ టేబిల్ మీదే అది గుండె ఆగి మరణించింది. ప్రస్తుతం దాని దేహం వాషింగ్టన్ డిసిలో నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది.
మిస్ బేకర్ అమెరికన్ హీరోగా 27 ఏళ్ల దాకా జీవించింది. పెన్సకోలాలోని నేవల్ ఎయిర్ ట్రైనింగ్ స్టేషన్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఇంట్లో దాన్ని ఉంచారు. దీనికి అమెరికన్స్ నించి సగటున రోజుకి 130 ఉత్తరాలు వచ్చేవి. మూడేళ్ల తర్వాత పెరూవియన్ స్క్విరల్ మంకీ జాతికి చెందిన బిగ్ జార్జ్ అనే మగ కోతితో నేవల్ పెరమనీతో దీనికి పెళ్లి చేశారు. 1971లో ఆ దంపతులని అలబామాలో హంట్స్‌విల్‌లో గల యు.ఎస్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్‌కి మార్చారు.
1979లో బిగ్ జార్జ్ మరణించడంతో నార్మన్ అనే ఇంకో కోతితో పునర్వివాహం జరిపించారు. దానికి తొడిగిన వెడ్డింగ్ డ్రెస్‌ని బేకర్ చింపేసింది. ఐదేళ్ల తర్వాత 29, నవంబర్ 1984న, 25 ఏళ్లు జీవించిన మిస్ బేకర్ కిడ్నీ ఫెయిల్ అవడంతో మరణించింది. దానికిగల ఇంకో రికార్డు ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన స్క్విరల్ మంకీ ఇదే. ఆ జాతి కోతులు అడవుల్లో సగటున 15 ఏళ్లు, జూలలో 20 ఏళ్లు మించి జీవించవు. యునైటెడ్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్లో జరిగిన దాని అంత్యక్రియలకి 300 మంది హాజరయ్యారు. దీని సమాధి మీద అరటి పళ్లని ఉంచుతూంటారు. బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌లకి వచ్చిన గుర్తింపు ఈ కోతులకి రాలేదు. తిరిగి రాని లైకాకి వచ్చిన పేరు వీటికి రాకపోవడం బాధాకరం.

-పద్మజ