'క్లాప్' కొట్టు గురూ!

విద్య ‘కహానీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి విద్యాబాలన్ ‘కహానీ’లో తప్పిపోయిన భర్త ఆచూకీ కోసం వెతికే భార్య క్యారెక్టర్‌ను ఎంతో ఉన్నంతగా పోషించి అందరి చేత ప్రశంసలందుకుంది. ఆ పాత్రలో విద్య చూపిన నటన ప్రేక్షకులకే కాదు, విమర్శకుల్ని సైతం ఎంతగానో ఆకట్టుకుంది. అలా తన పాత్రకు జీవం పోసి అందర్నీ కదిలించింది కాబట్టే ‘కహానీ 2’లోనూ మరోసారి తన పాత్ర ద్వారా అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త సిద్ధార్థ్ రాయ్‌కపూర్‌తో విద్యాబాలన్‌కి పెళ్లయి అప్పుడే నాలుగేళ్లయింది. అతడితో విద్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా హ్యాపీగా గడిచిపోతుంది. భర్త ప్రోత్సాహం తనను బాగా ఆకట్టుకునేలా చేసిందని చెబుతున్న విద్య అతడి సలహాలతో కెరీర్‌లో మరిన్ని మంచి పాత్రలు పోషిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. ‘‘ తాజా చిత్రం ‘కహానీ 2’లో దుర్గా రాణీసింగ్ పాత్ర బాగా క్లిష్టమైంది. ప్రపంచానికి కనిపించకుండా జీవిస్తుంటుంది. అనుకోకుండా ఆమెకు ఎదురైన సవాళ్లు బయటికి వచ్చేలా చేస్తాయి. నిజ జీవితంలో మనం ఇలాంటి మహిళల్ని చూడమేమో! దుర్గరాణీ సింగ్ క్యారెక్టర్ పోషించడం చాలా గర్వంగా వుంది. ఇలాంటి పాత్రలే నటిలోని ప్రతిభను వెలికి తీస్తాయి. అంతేకాదు, కెరీర్‌లో ఓ మైలురాయిలా కూడా ఇలాంటి పాత్రలే నిలిచిపోతాయి’’ అంటూ చెప్పుకొచ్చింది విద్య! ఏమంటారు ఆమె మాటల్లో వున్న నిజాయితీని చూసి. ప్చ్..విద్య!! ఇదీ..విద్య ‘కహానీ’ మరి!!