గ్రహానుగ్రహం

కృష్ణా పుష్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగస్టు 11, 2016 రాత్రి గురువు కన్యా రాశిలో ప్రవేశించిన కారణంగా మనకు పుష్కర విశేష దినములు 12 రోజులను 12వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్థారించారు. అయితే ఈ పనె్నండు రోజులు పుష్కరుడు 24 గంటలు కూడా నది మీదనే సర్వ దేవతా గణములతో కలిసి విహరిస్తారు. మరి ప్రతి నిమిషము ఒక విశేషమయినదే. ఇక స్నానం రాత్రి రెండవ ఝాము మూడవ ఝాము (యామములు) చేయరాదు అని శాస్త్రం కావున రాత్రి తొమ్మిదిన్నర నుండి తెల్లవారుజామున 3.30 వరకు స్నానం దోషమే. ఇక పితృ శ్రాద్ధం చేయుట ఒక గొప్ప వరము. మరి ఆ వరమును తండ్రి లేని వారు అందరూ పుష్కరం రోజులు 12 రోజులలో మీకు కుదిరిన రోజున పితృ శ్రాద్ధాదికములు నిర్వహించండి. పితృ శ్రాద్ధం పగలు 12.00 నుండి సా.3.30 వరకు విశేషం. నేడు వ్యాపార ధోరణిలో ఉదయ కాలంలోనే చేయుచున్నారు. ఇది తప్పు. ప్రాతఃకాలములో స్నానం దానం మరియు అపరాహ్ణంలో శ్రాద్ధం విశేషములు. నది దగ్గర ఈ ధర్మం పాటిస్తే అందరికీ సౌఖ్యం ఉంటుంది. పుష్కర శ్రాద్ధం నిర్వహించేవారు నది గట్టున మాత్రమే చేయనవసరం లేదు. నది దృగ్గోచరం అయ్యే ప్రాంతంలో ఎక్కడ చేసినా అది విశేషమే. నదికి ఉత్తర దిశలో వుండి శ్రాద్ధం నిర్వహించుట శ్రేష్ఠం. నదిని ఉద్దేశించి శ్రాద్ధాదికములు నిర్వహించవలెను కదా! తర్పణం చేయునప్పుడు మనం తూర్పు దిశగా ఉండి కుడిచేయి ఎడమ వైపునకు వంచి తర్పణం చేయవలెను కదా? నదిని ఉద్దేశించి చేయునప్పుడు నది వైపునకు తర్పణం వదులుతున్న భావన రావలెను. నదికి పృష్ఠ భాగం చూపుతూ శ్రాద్ధం చేయుట దోషమే. మరి స్నానం దానం విషయంలో నది - నదికి పారే దిశలు సంబంధం లేదు. ఎక్కడ అయినా చేయవచ్చు. ఇక మరొక నియమం ఉన్నది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఇంటిలో నదీ సమీపంలో ఎక్కడయినా శ్రాద్ధం నిర్వహించవచ్చు. నది ఒడ్డున మాత్రమే చేయాలి అనుట అదే కచ్చితం అనుట తప్పు. కేవలం తర్పణాలు వదలవలెను అనుకునేవారు ఉదయం నిత్య కర్మానుష్ఠానం చేయుట అయిన తరువాత తర్పణాలు చేయవచ్చు. మరి మలిన జలంతో తర్పణాలు శ్రాద్ధాలు చేయరాదు. ఈ విషయం గమనించండి. పితృ దేవతలను ఉద్దేశించి చేయు తర్పణాలు శుద్ధ జలంతోనే చేయాలి. పుష్కర యాత్రీకుల రద్దీ దృష్ట్యా శుద్ధ జలం దొరికిన చోట పుష్కర శ్రాద్ధం నిర్వహించండి.
మరి శుభకార్యం చేసిన సంవత్సరంలో తల్లిదండ్రులకు అబ్దీకములు పెట్టాలి. తప్పదు. ఇదికాక ఏ విశేష శ్రాద్ధము నిర్వహించరాదు. మహాలయం, ధర్మోదకం, తిలోదకం, తీర్థ శ్రాద్ధం, పుష్కర శ్రాద్ధం వంటివి. అందువలన శుభకార్యం 2015 సెప్టెంబర్ నుండి చేసిన వారు 2016లో పుష్కర శ్రాద్ధం చేయరాదు. కొందరు ఆరు నెలలు మాత్రమే నిషేధం అంటారు. ఇక పుష్కరాలు అయిన తరువాత వివాహాదులు యధావిధిగా కృష్ణా తీరస్థులు కూడా చేసుకోవచ్చు. నిషేధం లేదు. పుష్కర నిమిత్తంగా సంవత్సర కాలం శుభ కార్య నిషేధం అనేది ప్రాచీనులు ఆచరించలేదు. మరి దీనికి ఆధారం కృష్ణాతీరం నుండి మన ప్రాచీనులు వ్రాసిన పంచాంగాలే ఆధారం. కృష్ణా తీరస్థులకు సంవత్సర కాలం శుభ కార్యం నిషేధం అనేది మనం కొత్తగా చేసుకున్న సంప్రదాయం మాత్రమే. పై అంశాలు పెద్దలు పండితులు అందరితో కూడా చర్చించి రాసినవే. 1990 పుష్కరాలు అతః పూర్వం పుష్కరాలకు వినబడని ఈ కొత్త ధర్మశాస్త్రం ఇప్పుడు అందరు పండితులను ఆశ్చర్యపరుస్తోంది. అనవసర వదంతులు చేయవద్దు. యధావిధిగా శుభ కార్యాచరణలు చేయండి. ఆగస్టు 12 నుండి సంవత్సర కాలంపాటు అపరాహ్ణ సమయంలో కృష్ణా నదిలో చేయు తీర్థ శ్రాద్ధం పుష్కర శ్రాద్ధ ఫలితమే ఇస్తుంది.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)