నమ్మండి! ఇది నిజం!!

కాపలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1865. కేలిఫోర్నియాలోని ఓ చిన్న గ్రామంలోని ఓ రహస్య కేబిన్‌లో జేమ్స్ మద్యాన్ని తయారుచేసి అమ్ముతున్నాడు. ఓ రాత్రి అతనికి బయటి నించి అలికిడి వినిపించడంతో రైఫిల్‌ని అందుకుని, కేబిన్ తలుపు తెరచి ఎదురుగా కనపడ్డ కొత్త వ్యక్తిని అడిగాడు.
‘ఎవరు నువ్వు?’
‘మిత్రుడ్ని. తుపాకి పక్కన పెట్టు’ చెప్పి అతను లోపలికి వచ్చి కూర్చున్నాడు.
‘నిన్ను ఎప్పుడూ నేను చూడలేదు. నువ్వు నాకు మిత్రుడు ఏమిటి? అసలు ఎవరు నువ్వు?’ జేమ్స్ ప్రశ్నించాడు.
‘నా పేరు సిసిల్. స్కూల్ టీచర్ని. కంగారుపడకు జేమ్స్’
‘నా పేరెలా తెలుసు?’ జేమ్స్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘నీ గురించి చాలా తెలుసుకున్నాను. నేను రుచి చూడచ్చా?’ చెప్పి జేమ్స్ అక్రమంగా చేసిన మద్యం పీపాలోంచి కొంత తాగి చెప్పాడు.
‘బదులుగా నిన్ను ధనవంతుడ్ని చేయబోతున్నాను’
‘అక్రమ మద్యం తయారుచేయడం తప్ప నేను చట్టవిరుద్ధంగా ఏ పనీ చేయను. నాకు పరువు ఉంది’ జేమ్స్ చెప్పాడు.
‘నేను ఎలా కనిపిస్తున్నాను? పది లక్షల డాలర్లని మనిద్దరం పంచుకోబోతున్నాం’ సిసిల్ చెప్పాడు.
‘పది లక్షల డాలర్లే? అది ఎవరి సొమ్ము?’ జేమ్స్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘మనిద్దరిదీ. నువ్వు ఎప్పుడైనా అంత డబ్బు చూసావా?’
‘కలలోనే’ జేమ్స్ నిరుత్సాహంగా చెప్పాడు.
‘గత పదేళ్లుగా నేను ఆ సంపద గురించి పరిశోధిస్తున్నాను. అనేక పుస్తకాలు కూడా చదివాను. ఇప్పుడు అది ఎక్కడ ఉందో గ్రహించాను. అందుకు నీ నించి నాకు రెండు సహాయాలు కావాలి’
‘ఏమిటవి?’
‘ముందుగా నీ లారీ. అంత సొమ్ము తీసుకురావడానికి లారీ అవసరం. తర్వాత ఓ సమాచారం కావాలి’
‘ఏం సమాచారం?’ జేమ్స్ అడిగాడు.
‘ఇక్కడ చుట్టుపక్కల ఓ పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు ఎక్కడ కట్టారో తెలుసా? ఆ ఇంటికి చరిత్ర కూడా ఉంటుంది’
‘ఓ! మా మాత మా నాన్నకి చెప్పిన కథ ఇది. ఈ కొండలకి అవతల ఉన్న లోయలో చాలా కాలం క్రితం ఇద్దరు కాన్ఫిడరేట్ ఆఫీసర్లు చాలా బంగారాన్ని పెట్టెలతో తెచ్చి, ఇంటి కింద సెల్లార్లో దాచారు. రెండు రోజుల తర్వాత ఆ బంగారం గురించి తెలీని యాంకీ సైనికులు వచ్చి వాళ్లని చంపి ఆ ఇంటిని కాల్చేశారు. పాత పునాదుల మీద ఎవరో ఇంకో ఇంటిని నిర్మించారు. కాని నలభై ఏళ్లుగా ఎవరూ అందులో ఉండటం లేదు. ఆ ఇంటి పేరు లేరో హౌస్. బంగారం తెచ్చిన ఇద్దరు సైనికుల్లో ఒకరి పేరు లేరో. అది భూత్ బంగ్లా అనే భయంతో ఎవరూ ఆ ఇంటి దగ్గరకి వెళ్లరు’
‘మనం వెళ్తున్నాం. నేను హిస్టరీ టీచర్ని. నాకా బంగారం గురించి తెలుసు. వందేళ్ల క్రితం డేవిడ్ జెఫర్సన్ ట్రెజరీకి చెందిన ఆ బంగారాన్ని ఆ ఇద్దరు సైనికులకి ఇచ్చి దాచమని పంపాడు. విలియం రెండో సైనికుడి పేరు. కొంత వెండి, ఒక టన్ను బంగారం ఆ ఇంట్లో ఉన్నాయి. ఆ ఇల్లు ఎంత దూరం? ఆ బంగారం మనది అవబోతోంది’ సిసిల్ చెప్పాడు.
జేమ్స్ అతనితో బయటకి నడిచాడు. సూర్యోదయానికి మునుపే వాళ్లు లేరో హౌస్‌కి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్తూ జేమ్స్ చెప్పాడు.
‘ఇది మూఢనమ్మకం అనుకో. కాని మా నాన్న చెప్పిందాని ప్రకారం లేరో హౌస్‌కి వెళ్తే ఎవరూ ప్రాణాలతో బయటకి రాలేరు’
సిసిల్ ఆ ఇంటి తలుపు తోస్తే కిర్రుమంటూ తెరచుకుంది. లోపల అడుగుల చప్పుడు. ఒకతను లాంతర్ని వెలిగించి వీళ్ల దగ్గరికి వచ్చాడు.
‘మీరు ఎవరు? అనుమతి లేకుండా ఎందుకు వచ్చారు? వెళ్లిపోండి’ చెప్పాడు.
‘నువ్వే బహుశ అనుమతి లేకుండా వచ్చావేమో?’ సిసిల్ నవ్వుతూ అడిగాడు.
‘నా పేరు లేరో. నేనీ ఇంట్లో నలభై ఏళ్ల నించి వొంటరిగా నివసిస్తున్నాను. ఇక్కడ ప్రశాంతంగా మరణించాలని నా కోరిక’
‘జేమ్స్. నువ్వు ఎప్పుడన్నా ఇతన్ని చూసావా?’ సివిల్ అడిగాడు.
‘లేదు. వినలేదు కూడా’
‘మీకేం కావాలి?’ లేరో అడిగాడు.
‘ఓ టన్ను బంగారం’ సిసిల్ చెప్పాడు.
‘మీకు దాని గురించి తెలిసిందన్నమాట. కాని దాన్ని మీరు తీసుకెళ్లలేరు. అది మీది కాదు కాబట్టి దాన్ని ముట్టుకోకపోవడం మంచిది. అది కాన్ఫిడరేట్స్‌ది. వారిద్దరిలో ఒకరు నా తాత విల్సన్ లేరో’
‘వందేళ్ల క్రితం వారుండేవారు. ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారు? సెల్లార్ తలుపు ఎక్కడ?’ సిసిల్ ప్రశ్నించాడు.
‘ఈ ఇంటిని నిర్మించినప్పుడు మా నాన్న కావాలనే సెల్లార్‌కి తలుపుని పెట్టలేదు. కాన్ఫిడరేట్స్ ఆత్మలు కింద సెల్లార్‌లో బంగారానికి కాపలా కాస్తున్నారు. అక్కడికి వెళ్లడం ప్రమాదం’ ఆయన హెచ్చరించాడు.
ఆయన్ని కట్టేసి ఆ ఇద్దరూ తలుపు కోసం వెదకసాగారు. ఓ చోట వాళ్లకి ఓ రహస్య తలుపు కనిపించింది. దాని వెనక కిందకి మెట్లు. ఇద్దరూ మెట్లు దిగి కిందకి వెళ్తే కాన్ఫిడరేట్ యూనిఫాంలో రెండు అస్థిపంజరాలు కనిపించాయి. వాటి పక్కన చాలా పెట్టెలు ఉన్నాయి. కొన్ని తెరచి చూస్తే మెరిసే బంగారు నాణాలు కనిపించాయి. వారు ఆ పెట్టెని మూసి, చెరో వైపు పట్టుకుని వచ్చిన వైపు నడిచారు. కాని ఆశ్చర్యంగా వాళ్లకి నాలుగు వైపులా గోడలు తప్ప ఇందాక దిగిన మెట్లు కనపడలేదు. ఎటు నించి తాము వచ్చారో కూడా కనుక్కోలేక పోయారు.
కేలిఫోర్నియాలోని ఆ గ్రామం గెజిట్లో 3, జూన్ 1865న ఈ సంఘటన నమోదైంది. హిస్టరీ టీచర్ సిసిల్, జేమ్స్ మాయం అయ్యారని, వాళ్లు ఏమయ్యారో తెలీలేదని కూడా గెజిట్లో ఉంది. అది దేవుడికే తెలియాలి. ఇప్పుడు లేరో హౌస్ పర్యాటక కేంద్రంగా మారింది.
*