అవీ .. ఇవీ..

చేయిలేదని కలతపడవలదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పదేళ్ల బాలిక పేరు ఇసబెల్లా నికొల కాబ్‌రెర. అమెరికాకు చెందిన ఈ అమ్మాయికి పుట్టినప్పుడే ఒక చేయి భుజంవరకే ఉంది. అదీ తీరుతెన్నూ లేకుండా. జార్జ్ మాసన్ యూనివర్శిటీకి చెందిన బయో ఇంజనీరింగ్ విద్యార్థి అబ్దుల్‌గౌడ బృందం ఆమెను చూసి చలించిపోయారు. తమ పరిశోధనలు ఆమెకు ఎలా ఉపయోగపడతాయా అని ఆలోచించారు. ఆమెకు ట్యూషన్ చెప్పే టీచర్‌ను కలిశారు. ఇసబెల్లాకు వయొలిన్ వాద్యమంటే ఇష్టం అని తెలుసుకున్నారు. ప్రోస్థటిక్ (కృత్రిమ) చేతిని రూపొందించే పనిలో పడ్డారు. చాలా వైఫల్యాల తరువాత ఆమె వాడగలిగేలా కృత్రిమ ముంజేతిని సిద్ధం చేశారు. దీని కోసం త్రీడీ టెక్నాలజీని వాడారు. చివరకు ఆమె విజయవంతంగా ఆ మరచేతితో వయోలిన్‌ను వాయించింది. స్కూల్ టీచర్, గౌడ బృందం ఆనందానికి హద్దేలేకుండాపోయింది. ఇక ఇసబెల్లా అయితే ఆనందబాష్పాలు రాల్చింది.

- భారతి