ఓ చిన్నమాట!

ఫొటో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలోని ‘లా’ కాలేజీలో జాయిన్ అయ్యాను. వారాల ఆనంద్ కూడా అప్పుడు యూనివర్సిటీకి వచ్చాడు. కాలేజీ నుంచి యూనివర్సిటీ ప్రయాణం ఆ కాలంలో ఓ గొప్ప అనుభవం. ఓ విశాల ప్రపంచంలోకి వచ్చిన అనుభూతి. చాలా స్వేచ్ఛ.
ఉస్మానియా యూనివర్సిటీకి 100 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఆనంద్ రెండు మూడు ఫొటోలు వాట్సప్‌లో పంపించాడు. ఒకటి ఆర్ట్స్ కాలేజీ ముందు మా చిన్ననాటి మిత్రులతో దిగిన ఫొటో. రెండవది ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో దిగిన ఫొటో.
ఆ ఫొటోలు చూడగానే మనస్సు ఒక్కసారి నలభై సంవత్సరాల క్రితం వైపు పరుగు తీసింది. యూనివర్సిటీకి వచ్చిన కొత్తలో మా చిన్ననాటి మిత్రులతో కలిసి హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు తిరిగాం. గోల్కొండ ఖిల్లా, జూ, మ్యూజియం, యూనివర్సిటీ ఇట్లా ఎన్నో. గతంలో ఇందులో కొన్ని చూసినప్పటికీ అప్పుడు చూసినప్పటికీ యూనివర్సిటీకి వచ్చిన తరువాత చూసినప్పటికీ చాలా తేడా ఉంది. గతంలో పెద్దవాళ్ల అదుపు ఆజ్ఞలలో చూశాం. యూనివర్సిటీకి వచ్చిన తరువాత స్వేచ్ఛగా తిరిగాం.
ఆ ఫొటోల్లో కొంతమంది మిత్రులు చాలా సన్నిహితంగా నాతో ఉన్నట్టు అన్పించింది. జీవన వేగంలో ఆ సాన్నిహిత్యం మర్చిపోయినట్టు అన్పించింది. ఆ ఫొటోలు చూసిన తరువాత కొంత దూరమైన మిత్రులతో మళ్లీ తిరిగి సంభాషించాలన్న కోరిక కలిగింది.
జ్ఞాపకాలాంటివి ఫొటోలు. జ్ఞాపకాలు చెదిరిపోతాయేమో కాని ఫొటోలు అలా కాదు. జ్ఞాపకాలని గుర్తుకు తెస్తాయి.
ఇంటర్మీడియెట్ నుంచి డిగ్రీ వరకు ఫొటోల మీద చాలా ఆసక్తి ఉండేది. ‘లా’ చదువుతున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఉద్యోగంలోకి మారిపోయిన తరువాత సాక్ష్యాలు, ముద్దాయిలు, తీర్పులు పురుగు. ముప్పై సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియదు. ఆ పరుగులో ఫొటోలు ఎక్కడో పడిపోయాయి. ఇప్పుడు వాటిని వెతుక్కోవాలి. మర్చిపోయిన విషయాలని గుర్తుకు తెచ్చుకోవాలి.
ఫొటోలు చాలా ముఖ్యం. పెద్దవాళ్లు పోయిన తరువాత వాళ్ల ఫొటోల కోసం వెతుకుతాం. తాపత్రయ పడతాం. మనుషుల ఫొటోలే కాదు. ప్రాంతాల ఫొటోలు కూడా ఎన్నో విషయాలను గుర్తుకు తెస్తాయి. ఎక్కడికో మనల్ని తీసుకొని పోతాయి. ఎన్నో జ్ఞాపకాలు పొంగి పొరలుతాయి.
‘జ్ఞాపకాల కోసం నేను జీవించను/ నేను జీవిస్తాను/ జ్ఞాపకాలు వాటికవే తయారవుతాయి’
ఇది నా విషయంలోనే కాదు. అందరి విషయంలోనూ అంతే.

- జింబో 94404 83001