ఓ చిన్నమాట!
జిజ్ఞాస
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సమాచారాలు అందజేసుకోవడం చాలా సులువై పోయింది. అదే విధంగా ఏదైనా విషయం మీద మన అభిప్రాయాలు చెప్పడం, వాటిని అంతర్జాలంలో ప్రచురించడం సాంఘిక మాధ్యమాల్లో ఇంకా సులువై పోయింది. ప్రతి విషయంలో మంచీ చెడూ వున్నట్టు వీటి విషయంలో కూడా అంతే.
ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే - నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. యువకుల నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు వున్న వ్యక్తులూ ఉన్నారు. పెద్ద వాళ్లల్లో రెవిన్యూలో ఉద్యోగం చేసి స్పెషల్ మేజిస్ట్రేట్‌గా పని చేసిన వ్యక్తి ఒకరు. హోమియో డాక్టర్‌గా పని చేసిన వ్యక్తి మరొకరు. ఇద్దరికీ సాహిత్యం పట్ల అభిరుచి ఉంది. హోమియో డాక్టర్ కవిత్వం కూడా రాస్తారు. ఈ ఇద్దరికీ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి ఉంటాయేమో. ఇద్దరు కూడా సాంఘిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. వచ్చిన సమాచారాలని ఫార్వర్డ్ చేయడమే కాదు. ఎన్నో సంఘటనల మీద వాళ్ల అభిప్రాయాలని రాస్తూ ఉంటారు. నేనేమైనా రాస్తే వాటి మీద వాళ్ల అభిప్రాయాలని కూడా తెలియజేస్తూ ఉంటారు. వాళ్ల ఉత్సాహానికి నాకు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలుగుతూ ఉంటాయి.
చాలామంది 60 సంవత్సరాలు దాటగానే ఏదో కోల్పోయినట్టు భావిస్తూ ఉంటారు. జీవితంలో అంతా అయిపోయిందని అనుకుంటూ ఉంటారు. కొత్త విషయాల పట్ల ఆసక్తి కూడా కనబరచరు. స్మార్ట్ఫోన్ లాంటి వాటి జోలికిపోరు. ల్యాప్‌టాప్ లాంటివి వాడటానికి ఇష్టపడరు. ఆ ఇద్దరు మిత్రులు అలా కాదు. వాళ్లు స్మార్ట్ఫోన్లు వాడతారు. ల్యాప్‌టాప్ లాంటివి వాడుతూ ఉంటారు. వాళ్లు చాలా ఉత్సాహంగా కూడా కన్పిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా కూడా కన్పిస్తూ ఉంటారు. ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అన్నట్టుగా ఉంటారు. జిజ్ఞాసే వాళ్లను ఉత్సాహంగా ఉంచుతుందని అనుకోవచ్చు. ఈ విషయం గురించే వాళ్లని ఒకసారి అడిగాను. కొత్తలో స్మార్ట్ఫోనన్నా, ల్యాప్‌టాప్ అన్న నిరాసక్షత ఉండేదట వాళ్ల మనుమడు వాటి వల్ల ఉన్న ఉపయోగాలను చెప్పాడు. కొత్త విషయాలు తెలిసాయి. జిజ్ఞాస పెరిగిందని చెప్పారు.
నిజమే.
కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆ జిజ్ఞాస ఉండటం వల్ల ఆలోచన మొదలవుతుంది. జ్ఞాపకం ఉంచుకోవాలన్న ప్రయత్నం మొదలవుతుంది. అలాంటి సంకేతాలు మెదడుకి అనుకోకుండా వాళ్లు ఇస్తూ ఉంటారు.
ప్రశ్నలు ఏ విధంగా అడగాలి, యువకులతో ఏ విధంగా మాట్లాడాలి అన్న విషయాల మీద అవగాహన పెరుగుతూ ఉంటుంది. కొత్త విషయాల మీద ఆసక్తి ఏర్పరచుకోవడం వల్ల వాళ్ల మెదడు చురుగ్గా పని చేస్తూ ఉంటుంది.
నేర్చుకోవాలన్న తపన చాలా అవసరం. చాలా జ్ఞానాన్ని పూర్తిగా నింపుకోవాలని కాదు. రోజువారీ వ్యవహారాలకి అవసరమైన విషయాల్లో పరిజ్ఞానం పెంచుకోవాలి. యువకుల మాదిరిగా, చిన్నపిల్లల మాదిరిగా మనకు ఆ విషయాలు త్వరగా తెలియకపోవచ్చు. నేర్చుకోలేక పోవచ్చు. అయినా పర్వాలేదు. నేర్చుకోవాలన్న కాంక్ష మనకు ఎంతో కొంత నేర్పుతుంది.
నేర్చుకోవడం కష్టంగా అన్పిస్తే అలాంటి ఆసక్తి వున్న మరో వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. అలా చేసుకుంటే కొంత సాహచర్యం లభిస్తుంది. నేర్చుకోవాలన్న తపన లేకపోతే మనం చాలా డల్‌గా మారిపోతాం. ఇతరులకి దూరంగా ఉండటం వల్ల ఒంటరిగా ఫీలవుతూ ఉంటాం.
కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మన శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. మన మీద మనకి విశ్వాసం పెరుగుతుంది.
ఈ విషయంలో రాజకీయ నాయకులను ఆదర్శంగా పెట్టుకోవాలి. ఎంత వయసు వచ్చిన వాళ్లు రాజకీయ జీవితం నుంచి బయటకి రావడానికి ఇష్టపడరు. చాలా చురుకుగా వాళ్ల జీవనాన్ని కొనసాగిస్తారు.